ఆ హైవేపై భారీ వాహనాలకు నో ఎంట్రీ…

డేంజర్ జోన్ లో బతుకమ్మ వంతెన

దిశ దశ, చెన్నూరు:

తెలంగాణ నుండి మహారాష్ట్ర, చత్తీస్ గడ్ వెల్లే భారీ వాహనాలు దారి మల్లించుకోవల్సిన అవసరం ఏర్పడింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతంలో రహదారులు దెబ్బతింటున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా వెల్లే నేషనల్ హైవేపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు అధికారులు. చెన్నూరు సమీపంలోని బతుకమ్మ వంతెన వరద ఉధృతికి దెబ్బతిన్న నేపథ్యంలో భారీ వాహనాలు వెల్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తాత్కాలింగా ఈ రహదారి మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేవలం లైట్ మెటార్ వెహికిల్స్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. చెన్నూరుకు దిగువన ఓ వైపు నుండి ప్రాణహిత, మరో వైపునుండి గోదావరి నదులు ప్రవహిస్తుండగా ఈ రెండు నదుల్లో కూడా వరద నీరు తీవ్రంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారికి సమీపంలోని వరద నీరు వచ్చి చేరడంతో బతుకమ్మ వంతెన శిథిలావస్తకు చేరింది. దీంతో్ ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ బ్రిడ్జి మీదుగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. చెన్నూరుకు దిగువన ఉన్న పారుపెల్లితో పాటు ఇతర గ్రామాల పంట చేలల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. చెన్నూరు ప్రాంతంలో స్పెషల్ ఆఫీసర్ భారతి హెలిక్కేరి పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

You cannot copy content of this page