బీజేపీ సభ్యత్వ సేకరణలో విషాదం: మండల నేత హఠాన్మరణం

దిశ దశ, మహదేవపూర్:

భారతీయ జనాతా పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో విషాదం అలుముకుంది. పార్టీ మెంబర్ షిప్ కోసం సభ్యుల వివరాలను అప్ లోడ్ చేస్తుండగా పార్టీ మండల నాయకుడు హఠన్మారణం చెందారు. జయశంకర్  భూపాలపల్లి జిల్లా మహధేవపూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బీజేపీ సభ్యత్వ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన నాయకులు పలువురు కూడా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ మండల కార్యదర్శి మంథని రాజేందర్ బీజేపీ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. ఇదే సమయంలో రాజేందర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచర పార్టీ శ్రేణులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించే సరికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. దీంతో మండల బీజేపీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సునీల్ రెడ్డి మహదేవపూర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

మాట్లాడుతూనే…

కుల వృత్తిని చేసుకుంటూ జీవన సాగిస్తున్న రాజేందర్ ఆదివారం సహచర పార్టీ నాయకులతో ముచ్చటిస్తూ సభ్యత్వ సేకరణ చేస్తున్న క్రమంలోనే కుప్పకూలిపోవడంతో పార్టీ శ్రేణులను షాకుకు గురి చేసింది. తమతో నవ్వుకుంటూ మాట్లాడుతున్న రాజేందర్ హఠాన్మరణం చెందడంతో మండల బీజేపీ నాయకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమతో మాట్లాడుతుండగానే ఆయన ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుని తిరిగిరాని లోకాలకు చేరిన తీరు వారిని కలిచివేసింది. 

You cannot copy content of this page