దిశ దశ, చెన్నూరు:
వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంటను మృత్యువు కబలించిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. విద్యుత్ షాక్ రూపంలో దంపతులిద్దరూ చనిపోయిన విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. దీంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం విషాదంతో మూగబోయింది. విద్యుత్ షాక్ కారణంగా దంపతులు మృత్యువాత పడడంతో చెన్నూరు పట్టణ స్వర్ణ కారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… చెన్నూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బొల్లంపల్లి శ్రీనివాస్ (45), అతని భార్య శశిదేవి (38)లు షాట్ సర్క్యూట్ కారణంగా మృత్యువాత పడ్డారు. గురువారం అర్థరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో పేరుకపోయిన ధుమ్ము ధూళిని శుభ్రం చేసేందుకు లత శుక్రవారం ఉదయం కరెంటు మోటారు వేసి నీటితో కడుగుతున్నారు. ఈ క్రమంలో షాట్ సర్క్యూట్ కావడంతో లత అరవడంతో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ తన భార్యను కాపాడాలన్న ఆతృతలో ఆమెను పట్టుకోవడంతో ఇద్దరు కూడా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయారు.
కన్న కొడుకు కానరాని దూరాలకు చేరి…
తాళి కట్టిన ఆలి తనువు చాలించగా సంతానం చూసుకుంటారనుకున్న అతన్ని విధి వెక్కిరించింది. ఐదేళ్ల క్రితం పెద్ద కొడుకు కూడా కానరాని లోకానికి చేరుకోగా ఏడు పదుల వయసుకు చేరిన ఆ తండ్రి లక్ష్మీ నారాయణ చిన్న కొడుకు శ్రీనివాసు దంపతుల్లో తన వారిని చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. ఓ వైపున భార్యను కోల్పోయి మరోవైపును పెద్దోడు చనిపోయిన బాధను దిగమింగుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఆ వృద్దుడిపై మరో పిడుగు పడినట్టయింది. శుక్రవారం చిన్న కొడకు, కోడలు కూడా విగతజీవులుగా మారిపోవడాన్ని చూస్తూ ఆయన రోధిస్తున్న తీరు అందరిని కండతడి పెట్టిస్తోంది. జీవిత భాగస్వామి దూరం అయినా రక్తం పంచుకుని పుట్టిన పెద్ద వాడు మరణించినా చిన్నోడు ఉన్నాడన్న ధీమాను కరెంటు షాకు ఆ తండ్రికి దూరం చేసిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోవైపున శ్రీనివాస్ తన కొడుకులను చూస్తూ వారు ఉన్నత చదువుల వైపు సాగుతున్న తీరుతో మురిసిపోతున్న క్రమంలో ఇద్దరు బిడ్డలకు తల్లి దండ్రులను దూరం చేయడం కూడా స్థానికులను కలిచివేస్తోంది. శ్రీనివాస్ పెద్ద కొడుకు డిగ్రీ చేస్తుండగా, చిన్న కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు.
Disha Dasha
1884 posts
Next Post