రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

డ్యూటీకి వెల్తుండగా ఘటన

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్యూటీలో భాగంగా స్కూటీపై వెల్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృత్యువాత పడ్డారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ లోని అలుకాపురి కాలనీకి చెందిన రజిత రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ మ్యాథ్స్ పీజీ టీచర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం తన వాహనంపై వెల్తుండగా కాంక్రీట్ మిక్సర్ ట్రాన్స్ పోర్టు చేసే ట్యాంకర్ స్కూటీ మీదుగా వెల్లడంతో ఆమె అక్కడిక్కడే మరణించారు. నిత్యం అలుకాపురి నుండి మానేరు స్కూలు వరకు స్కూటీపై చేరుకుని అక్కడి నుండి బస్సులో వెల్లే రజిత మరో 20 నుండి 30 మీటర్ల దూరం చేరుకుంటే సేఫ్ గా ఉండేవారు. కానీ ట్యాంకర్ రూపంలో ఆమెను మృత్యువు కబలించిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ శివార్లలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టు మార్టంకు తరలించారు. రజితకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలుస్తోంది..

హెల్మెట్ పెట్టుకున్నా…

జర్నీ చేసేప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే వెల్తుంటారు రజిత. శుక్రవారం కూడా తన స్కూటీపై హెల్మెట్ పెట్టుకుని వెల్తుండగా భారీ వాహనం ఆమె బైక్ మీదుగా వెల్లడంతో శరీరం అంతా తునాతునకలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. భారీ వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతుండడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రజిత స్కూటీ మీద సిరిసిల్ల బైపాస్ మీదుగా వస్తుండగా ఎదురుగా వస్తున్న కాంక్రీట్ మిక్సర్ ట్యాంకర్ ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ టూ టౌన్ సీఐ తాతా లక్ష్మీబాబు తెలిపారు.

You cannot copy content of this page