దిశ దశ, ఏపీ బ్యూరో:
తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఏపీలోని పలు ప్రాంతాలు జలమయం కాగా హైవేలు కూడా వరద నీటి ప్రవాహాంతో వాగులు, వంకలను తలపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. తాజాగా రైల్వే అధికారులు కూడా పలు రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. మరికొన్నింటిని ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో విజయవాడ మీదుగా వెల్లే 12 రైళ్లను రద్దు చేయగా, మరో నాలుగు రైళ్లను ఆయా ప్రాంతాల్లో నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు కూడా రైళ్లను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది.