గ్రామస్తుల సంతోషం కోసం సంతోష్ సాహసం…

సూర్యపేట జిల్లాలో ట్రాన్స్ కో హెల్పర్ చొరవ

దిశ దశ, నల్గొండ:

ఓ వైపుకున కుండపోతగా కురుస్తున్న వర్షాలు… మరో వైపున వరద బీభత్సంతో అతలాకుతలం అవుతున్న జనం… ఉన్నట్టుండి ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక కరెంటు రావడం కష్టమే అనుకున్న సమయంలో విద్యుత్ పునరుద్దరణ కోసం ఓ హెల్పర్ చేసిన సాహసం వైరల్ గా మారింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సూర్యపేట జిల్లా పాతర్లపహాడ్ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కారణం ఏంటో తెలుసుకున్నారు. గ్రామ పొలిమేరల్లో విద్యుత్ లైన్ తెగిపోయిందని గుర్తించినప్పటికీ అక్కడకు వెల్లాలంటే భారీగా వరద నీరు వచ్చి చేరి ఉంది. విద్యుత్ స్తంభం వద్దకు వెల్లి కరెంటు సరఫరా కోసం తెగిపోయిన విద్యుత్ వైరును కనెక్ట్ చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే ఎలక్ట్రిక్ పోల్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయిందని నీరు తగ్గు ముఖం పట్టాక విద్యుత్ పునరుద్దరణ చేస్తామని చెప్తుంటారు. కానీ ట్రాన్స్ కో లైన్ మెన్ దగ్గర హెల్పర్ గా పనిచేస్తున్న కొప్పుల సంతోష్ ఆ నీటిలోనే ఈదుకుంటూ వెల్లి విద్యుత్ స్తంభం ఎక్కి మరీ తెగిపోయిన వైరును సరి చేశారు. దీంతో పాతర్లపహాడ్ గ్రామంలో విద్యుతు కాంతులు విరజిమ్మాయి. వర్షం జోరుగా కురుస్తున్న సమయంలో విద్యుత్ షాకుకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిసి కూడా హెల్పర్ చేసిన చొరవ గురించి తెలుసుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి అతన్ని అభినందించారు. అంతేకాకుండా హెల్పర్ నీళ్లలో వెల్తున్న వీడియోను కూడా ట్విట్ చేశారు.
https://twitter.com/jagadishBRS/status/1684884758600556544?t=dTc6_ATAT1L8g4CTCC9xdg&s=19

You cannot copy content of this page