దిశ దశ, ఏపీ బ్యూరో:
ఏపీలో ఎన్నికల కమిషన్ వేటు వేసు ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు వివిధ హోదాల్లో ఉన్న అధికారులపైనే చర్యలు తీసుకున్న ఈసీఐ ఏకంగా పోలీసు బాసునే మార్చేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే విధుల నుండి రిలీవ్ కావాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు అధికారుల ప్యానెల్ ను పంపించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది ఈసీఐ. సీఎస్, డీజీపీలపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఎన్నికలు పారదర్శకంగా సాగడం లేదని ఆయా పార్టీలో ఆరోపించాయి. ఈ నేపథ్యంలో డీజీపీపై బదిలీ వేటు పడడం సంచలనంగా మారింది.