పరారీలో ఉన్న ఎస్సై వీఆర్ కు… జగిత్యాల జిల్లాలో బదిలీలు

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో 18 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం  బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో బదిలీలు అయిన ఎస్సైల వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్బీఐలో పని చేస్తున్న టి అశోక్ రాయికల్ కు అక్కడ పని చేస్తున్న అజయ్ ని వెకెన్సీ రిజర్వూకు, పెగడపల్లి ఎస్సై జె రామకృష్ణ సీసీఎస్ కు, ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో పని చేస్తున్న సిహెచ్ రవికిరణ్ పెగడపల్లికి, గుడిహత్నూరు ఎస్సై ఇమ్రాన్ సయ్యద్ జగిత్యాల టౌన్ పీఎస్ 1 ఎస్సైగా, బీర్పూర్ ఎస్సై గౌతం పవార్ వెకెన్సీ రిజర్వూకు, మల్యాల్ ఠాణా 2 ఎస్సై కె కుమార స్వామి బీర్పుర్ కు బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా గడిగుడ ఎస్సై గంగుల మహేష్ జగిత్యాల టౌన్ 2 ఎస్సైగా, నిర్మల్ జిల్లా భైంసా ఎస్సై వై ఇంద్రకరణ్ రెడ్డి ధర్మపుర్ రెండో ఎస్సైగా, వెకెన్సీ రిజర్వూలో ఉన్న సిహెచ్ సుధీర్ రావు మల్యాల 2 ఎస్సైగా, జగిత్యాల సీసీఎస్ ఎస్సై పి దత్తాద్రి సారంగపూర్ కు, వీఆర్ లో ఉన్న కె రాజు మెట్ పల్లి రెండో ఎస్సైగా, జగిత్యాల టౌన్ వన్ ఎస్సై మల్యాల ఎస్సై వన్ గా, మల్యాల వన్ ఎస్సై అబ్దుల్ రహీమ్ స్పెషల్ బ్రాంచ్ కు, వెకెన్సీ రిజర్వూలో ఉన్న పి గీత జిల్లా క్రైం రికార్డ్ బ్యూరోకు, సారంగపూర్ ఎస్సై ఎ తిరుపతి వీఆర్ కు, కోరుట్ల స్టేషన్ లో అటాచ్డ్ డ్యూటీలో ఉన్న మహ్మద్ ఆరీఫుద్దీన్ జగిత్యాల పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అయ్యారు.

ఆ ఎస్సై వీఆర్ కు…

జిల్లాలోని రాయికల్ ఎస్సైగా పని చేస్తున్న అజయ్ ఏసీబీ ట్రాప్ నుండి తప్పించుకున్నారు. గత నెల 22న నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 10 వేలు తీసుకునేందుకు ఒఫ్పందం కుదిరింది. మధ్యవర్తిగా ఇటిక్యాలకు చెందిన రాజు ద్వారా లంచం డబ్బులు తీసుకోవల్సి ఉన్న క్రమంలో ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. రాత్రి 10 గంటల సమయంలో స్టేషన్ వద్దకు చేరుకున్న ఎస్సై అజయ్ ఏసీబీ అధికారులను గమనించి తప్పించుకున్నాడు. దీంతో మధ్యవర్తి రాజును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అప్పటి నుండి విధులకు హాజరు కాకుండా, ఏసీబీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తాజాగా జిల్లా ఎస్పీ విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో ఆయన్ను వీఆర్ కు పంపిస్తున్నట్టుగా వెల్లడించారు.

You cannot copy content of this page