ఆమె కోసం అతడు… ట్రాన్స్ జెండర్ తో పెళ్లి…

కొంతమందిలో ప్రేమ ఎలా పుట్టుకొస్తుందో తెలియదు… తాను నచ్చిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సాహసిస్తారు. సమాజం కోసం కాదు ఒకరికి ఒకరం అన్నట్టుగా జీవనం సాగించాలని భావించిన ఓ జంట ఒక్కటైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఒక్కటైన ఈ జంట గురించి తెలుసుకుంటే ఇదేరా ప్రేమంటే అని అనకుండా ఉండలేరేమో. జమ్మికుంట పట్టణంలో కొంతకాలంగా నివాసం ఉంటున్న దివ్యను జగిత్యాలకు చెందిన హర్షిత్ వివాహం చేసుకున్నారు. ఇది కామనే కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారు కదు.. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం…

జగిత్యాలకు చెందిన అర్షద్ ఖిల్లాగడ్డలో నివసిస్తూ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఆ సమయంలో జగిత్యాలలో కొంతకాలం నివాసం ఉన్న దివ్య పరిచయం కాగా కలిసి సహజీవనం చేద్దామని అర్షద్ ప్రపోజ్ చేశాడు. అయితే ఇందుకు దివ్య సుముఖత వ్యక్తం చేయలేదు. ట్రాన్స్ జెండర్ గా రూపాంతరం చెంది దివ్వగా జీవనం సాగిస్తున్న ఆమె అర్షద్ ప్రతిపాదనలను మొదట తిరస్కరించారు. ఆ తరువాత సర్జరీ చేయించుకున్న దివ్య జమ్మికుంట పట్టణంలో నివాసం ఉంటు అడపాదడపా అర్షద్ తో ఫోన్లో మాట్లాడేవారు. ఈ క్రమంలో సహజీవనం చేద్దామని వివాహం చేసుకుని కలిసి బ్రతుకుదామంటూ ప్రతిపాదలు చేస్తున్నా దివ్య వ్యతిరేకించారు. చివరకు గురువారం జమ్మికుంటకు వెల్లిన అర్షద్ దివ్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు.

పేరు మార్చుకుని…

అర్షద్ దివ్య కోసం హర్షిత్ గా పేరు మార్చుకుని మరీ హిందూ సాంప్రాదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం. శుక్రవారం ఉదయం జమ్మికుంట పట్టణంలోని వీరిద్దరు మూడుమళ్ల బంధంతో ఏడడుగులు నడిచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. పారాణి వేసుకోవం, తాళి కట్టడం, దండలు మార్చుకోవడం తదితర హిందూ సాంప్రాదాయం ప్రకారమే వీరిద్దరి పెళ్లి తంతు సాగింది. ఆ తరువాత దివ్య, హర్షిత్ లు జమ్మికుంట సమీపంలోని ఇల్లందకుంట రామాలయంలో స్వామి వారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా దివ్య మీడియాతో మాట్లాడుతూ… కొత్త జీవితం ప్రారంభిస్తున్న తమకు అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించారు. అలాగే హర్షిద్ ఇక నుండి తన జీవిత భాగస్వామి అయిన దివ్య చెప్పినట్టుగా నడుచుకుంటూ ఆదర్శవంతంగా ఉంటామని అన్నారు.

దివ్య, హర్షిత్ ల వివాహానికి సంబందించిన మరిన్ని వివరాలు… వారేం అంటున్నారో వారి మాటల్లోనే వినేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://youtu.be/AtfVT0CTvfY

You cannot copy content of this page