దినసరి కూలీగా పద్మశ్రీ అవార్డు గ్రహీత

దిశ దశ, హైదరాబాద్:

దేశంలోనే అత్యున్నమైన నాలుగో పురస్కారం అందుకున్న ఆయన రోజు వారి కూలీగా మారిపోయాడు. అరుదైన సాహిత్యాల్లో ఒకటైన కిన్నెరకు నేటికీ జీవం పోస్తున్న ఆ వృద్ద కళాకారుడు కూలీ నాలీ చేసుకుంటే తప్ప పొట్టగడని పరిస్థితి నెలకొంది. దీంతో గృహ నిర్మాణ పనుల్లో ఆయన కూలీ పనికి వెల్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిన్నెర మొగులయ్య హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజిల్ లో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పురస్కారంతో గౌరవించింది. తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేల గౌరవ వేతనంతో పాటు 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కెటాయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆయనకు గౌరవ వేతనం నిలిచిపోగా, భూమి కెటాయింపు ప్రక్రియ కూడా జరగలేదు. దీంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మొగిలయ్య కూలి పనికి వెళ్లక తప్పని పరిస్థితే తయారైంది. మరో వైపున ఆయన ఒక కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నందున నెలకు రూ. 7 వేల వరకు మందులు, పరీక్షలకు ఖర్చు అవుతోంది. అటు కుటుంబ పోషణతో పాటు ఇటు కొడుకు అనారోగ్య సమస్యను పరిష్కరించుకునేందుకు మొగిలయ్య కూలీ పనికి వెళ్లక తప్పనిసరి అయింది. భీమ్లానాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ కూడా మొగిలయ్యకు అవకాశం కల్పించడంతో ఆయన కళకు మరింత గుర్తింపు లభించింది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన మొగులయ్య 8వ తరగతి వరకు చదువుకోగా 12 మెట్ల కిన్నర వాయిద్య కళాకారుడిగా గుర్తింపు పొందారు. 12 మెట్ల కిన్నరను వాయించే వారు నేటితరంలోనే అత్యం తక్కువగా ఉండగా. అందులో దర్శనం మొగులయ్య ఒకరు. హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్న ఆయనకు 2015లో ఉగాది విశిష్ట పురస్కారం కూడా అందుకున్న మొగులయ్యా 52 దేశాల ప్రదినిధుల ముందు 12 మెట్ల కిన్నర వాయిద్య కళను ప్రదర్శించాడు. ఆయన చరిత్రను 8వ తరగతి సాంఘీక శాస్త్రంలో కూడా చేర్చి నేటి తరానికి అందించే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చరిత్ప పుటల్లో తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్ చేసుకున్న మొగులయ్య నేడు పూట గడవడం కోసం, అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న కొడుకు కోసం కూలీ పని చేస్తున్నాడు.

You cannot copy content of this page