దిశ దశ. ఏపీ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు రాజీనామ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరాభవాన్ని చవి చూసిన వైసీపీ నేతలు బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భూమన కర్ణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ ఈఓకు తన రాజీనామా లేఖను పంపించారు.