బ్యాంకింగ్ సేవలపై ట్విట్టర్ నజర్

ఉత్తర ప్రత్యుత్తారలకు ప్రధాన వేదికగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. వీవీఐపీల నుండి సామాన్యుల వరకూ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖల ట్విట్టర్ అకౌంట్లు ఫాలో అవుతున్న వారి సంఖ్య మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్స్ కు చేరుకుంటోందని మనం వింటూనే ఉన్నాం. అంతటి డిమాండ్ ఉన్న ట్విట్టర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ తో ముందుకు రాబోతోంది. తన సేవలను విస్తృత పర్చే యోచనలో ఉన్నట్టు ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సోషల్ మీడియా నెట్ వర్క్ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల ప్రక్రియలోకి కూడా ఎంటర్ కావాలని నిర్ణయించుకోంది. ఫోన్‌పే, గూగుల్ ప్లే మాదిరిగా ట్విటర్‌ ద్వార కూడా నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ట్విటర్ లో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు అడ్వర్టైజర్ల సమావేశంలో ఎలన్ మస్క్ ప్రకటించారు. ఇప్పటికే ట్విటర్‌లో కొత్తగా బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ విధాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో చెల్లింపుల ప్రక్రియను కూడా మరింత విస్తరించి నగదు లావాదేవీలు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ లావాదేవీలు జరుపుకునే వారు బ్లూటిక్ ఖాతాదారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా సైన్-అప్ అయి నగదు బదిలీ చేసుకోవచ్చన్నారు. బ్యాంకు అకౌంట్ బదులుగా ట్విటర్ అకౌంట్‌లోనూ నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని, అలాంటి చెల్లింపులు చేసిన యూజర్లకు ఎక్కువ వడ్డీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో డెబిట్ కార్డులు, చెక్కులు జారీ చేసే విధంగా సంస్థ సేవలు విస్తరిస్తామని వివరించారు. ఇప్పటికే ట్విటర్ ద్వారా డిజిటల్ చెల్లింపులకు అనుమతి కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది.

You cannot copy content of this page