రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జనవరి 30, 31న సమ్మె చేయాలని నిర్ణయించారు. ముంబైలో జరిగిన సమావేశంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ప్రధాన డిమాండ్లు..నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) రద్దు చేయడం, వారానికి ఐదు రోజుల పని, తక్షణమే పెండింగ్ సమస్యల పరిష్కిరించడం, వేతన సవరణలు చేయడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో కొత్తగా నియామకాలు చేయడం.