దిశ దశ, న్యూ ఢిల్లీ:
కరీంనగర్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన రెండో బీజేపీ ఎంపీకి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక్కడి నుండి ఇప్పటి వరకు గెలిచిన ఇద్దరు కూడా కేంద్ర క్యాబినెట్ బాధ్యతలు నిర్వర్తించిన క్రెడిట్ దక్కినట్టయింది. గతంలో ఇక్కడి నుండి బీజేపీ ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు వాజపేయ్ సర్కారులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా, తాజాగా బండి సంజయ్ కి కూడా ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ లో బెర్త్ ఖాయం అయిపోయింది.
పీఎంఓ నుండి పిలుపు…
ఢిల్లీలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఎంపీలకు కొద్ది సేపటిక్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుండి పిలుపు వచ్చింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లకు పిలుపు వచ్చింది. వీరు కొద్దిసేపటి క్రితం ఒకే కారులో ప్రధానమంత్రి నివాసానికి బయలు దేరారు. అక్కడ జరిగే తేనీటి విందులో వీరిద్దరు హాజరు కానున్నారు.
కేంద్ర క్యాబినెట్ ఇదే…
రాజ్ నాథ్ సింగ్. నితిన్ గడ్కరి, అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరీ, అశ్విణీ వైష్ణవ్, రావు ఇంద్రజిత్, కిరణ్ రిజుజు, కమల్ జిత్, రాకేష్ ఖడ్సే, బండి సంజయ్ కుమార్, ప్రతాప్ రావు జాదవ్, మన్సుఖ్ మండవియా, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషీ, జ్యో్తిరాధిత్య సింధియా, అర్జున్ రామ్ మెఘవాల్, చిరాగ్ పాశ్వాన్, జితన్ రాం మాంజీ, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, హెచ్ డి కుమార స్వామి, కింజారపు రాం మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, పియూష్ గోయల్, శరబానంద్ సోన్వాల్, రామ్ నాథ్ ఠాకూర్, అన్నమలై, డాక్టర్ జితేందర్ సింగ్ లు ఉన్నారు. ఇంకా పూర్తి బాజితా విడుదల కావల్సి ఉంది.