తీరు మారలేదా…? అత్యాశ తగ్గడం లేదా..?

దిశ దశ, హైదరాబాద్:

ఓ వైపున ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నా రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన అదికార యంత్రాంగం మాత్రం తమ వైఖరిని మార్చు కోవడం లేదు. ఇటీవల కాలంలో పెరిగిపోయిన అవినీతి నిరోధక శాఖ దాడులను పట్టించుకోని అధికారులు చేతులు తడపనిదే పని చేయమని తేల్చి చెప్పి పట్టుబడుతున్నారు. పలుకుబడి ఉన్న వారిని కూడా వదలడం లేదన్న విషయాన్ని కూడా విస్మరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం రెడ్ హైండడ్ గా పట్టుబడి కటకటాలపాలవవతున్నారు. గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో సబ్ రిజిస్ట్రార్, ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ పట్టుబడడం సంచలనంగా మారింది.

పార్టిషన్ డీడ్ కోసం

పార్టిషన్ డీడీ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం లేనిదే పని చేసేది లేదని తేల్చిచెప్పిన పరకాల సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మాదారం శివార్లలోని 481సి సర్వే నెంబర్ భూమిని పార్టిషన్ చేసేందుకు రూ. 80 వేల లంచం అడిగారు. డాక్యూమెంట్ ఆపరేటర్ నరేష్ ద్వారా రూ. 80 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. గురువారం మద్యాహ్నం లంచం డబ్బులు తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ సునిత, ప్రైవేటు ఉద్యోగి నరేష్ లను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

కోర్టు ఆదేశాలున్నా…

మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్సై బాణాల రాము రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. శ్రావణి అనే మహిళ వద్ద కొత్తగూడెంకు చెందిన గణేష్ అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు చెల్లించకముందే గణేష్ మరణించడంతో అతని వారసులపై కోర్టుకు వెల్లిన శ్రావణి వారి ఆస్థుల జప్తు ఆధేశాలను తీసుకున్నారు. అయితే కోర్టు అటాచ్ మెంట్ ఆర్డర్ ఉన్న ఈ ఆస్థిని వేరే వారికి విక్రయించడంతో పాటు బ్యాంకులో రుణం కూడా తీసుకున్నారు. ఈ విషయంపై పెద్ద మనషుల ద్వారా భూమి కొన్న వారిని, అమ్మిన వారిని శ్రావణి సంప్రదించిన తరువాత ఆమెను బెదిరింపులకు గురి చేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కోర్టు రెఫర్ కేసు నమోదు చేసేందుకు ఆదేశాలు ఇచ్చిన తరువాత కొద్ది రోజులకు ఎస్సై బాణాల రాజు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ వ్యవహారంలో శ్రావణి తరుపు న్యాయవాది లక్ష్మారెడ్డిని పిలిపించుకున్న రాజు మందు రూ. 20 వేలు ఇవ్వాలని ఆ తరువాత మిగతా డబ్బు సర్దుబాటు చేయాలన్నారు. దీంతో ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో గురువారం రూ. 20 వేలు లంచం తీసుకుంటండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు.

అధికారుల పేర్లు…?

అయితే పాల్వంచ టౌన్ ఎస్సై బాణాల రాజు అడ్వకేట్ లక్ష్మారెడ్డిని పిలిపించుకుని మాట్లాడినప్పుడు మొదట ఇచ్చిన ఫిర్యాదు క్లోజ్ చేశామని చెప్తూ… ఇద్దరు డీఎస్పీలు ఒత్తిడి చేశారని చెప్పడం గమనార్హం. శ్రావణికి వ్యతిరేకంగా ఉన్న వారు పలుకుబడి కలిగిన వారని అందువల్లె మొదట ఇచ్చిన ఫిర్యాదును మూసివేశామని ఎస్సై చెప్పినట్టుగా అడ్వకేట్ లక్ష్మారెడ్డి మీడియాకు వివరించారు. అంటే శ్రావణికి అనుకూలంగా కోర్టు ఉన్న కోర్టు ఉత్తర్వులను ధిక్కారించినట్టు అవుతుందన్న విషయం అధికారులకు తెలియకుండా చెప్పారా లేక ఎస్సై కావాలనే వారి పేర్లు వాడుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.

You cannot copy content of this page