హెరాయిన్ డ్రోన్లను పంపిన పాక్

భారత్‌లోకి పాకిస్థాన పంపించిన రెండు డ్రోన్లను పంజాబ్‌లోని సరిహద్దుల్లో భద్రతా దళాలు కూల్చివేశాయి. రెండు డ్రోన్ల నుండి దాదాపు 10కిలోల హెరాయిన్‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 11.05గంటల సమయంలో అమృత్‌సర్‌కు 40కిలోమీటర్ల దూరంలోని చహర్‌పూర్‌లోకి ఓ డ్రోన్ ప్రవేశించిందని, దానిని గుర్తించిన బీఎస్ఎఫ్ మహిళా సిబ్బంది 25రౌండ్లపాటు కాల్పులు జరిపి, కూల్చివేశారని తెలిపారు. 18కేజీల బరువున్న ఆ డ్రోన్ 3.11కిలోల నార్కొటిక్స్‌ని మోసుకొచ్చిందని వెల్లడించారు. అదే రాత్రి మరో డ్రోన్ 6.6కేజీల హెరాయిన్‌ను తార్న్ తారన్ జిల్లాలోని కలాశ్ హవేలియన్ గ్రామంలోకి మోసుకొస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చారని అధికారులు వివరించారు. అదే సమయానికి వాడాయి చీమ బార్డర్ అవుట్ పోస్టు సమీపంలో మూడో డ్రోన్ కూడా కనిపించిందని, అయితే, సైన్యం కాల్పులు జరపడంతో తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయిందని చెప్పారు.

You cannot copy content of this page