ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసిస్తున్నయువతులకు ఆర్థిక సహాయం అందించేందుకు U-Go స్కాలర్షిప్ అందించే ప్రోగ్రాం చేపట్టింది. టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న యువతులు మాత్రమే ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న యువతులకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్ ఫస్టీయర్ చదువుతున్న యువతులు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అయితే 10,12 తరగతుల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులయి ఉండడంతో పాటు
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించని భారతీయ యువతులు మాత్రమే అర్హులు.
స్కాలర్ షిప్: టీచింగ్ కోర్సులకు రెండేళ్ల కాలానికి రూ. 40,000, నర్సింగ్ అండ్ ఫార్మా కోర్సులకు నాలుగేళ్లకు రూ. 40,000, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సు చదివే వారికి రూ. 60,000 ఇవ్వనున్నారు. స్కాలర్ షిప్ మొత్తాన్ని యువతులు తమ అకాడమిక్ ఖర్చులైన ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్, ట్రావెల్, ఇంటర్నెట్, పుస్తకాలు, స్టేషనరీ, ఆన్‌లైన్ కోర్సులకు ఉపయోగించుకోవాలి.
దరఖాస్తుతో పాటు అందించాల్సిన పత్రాలు: 12వ తరగతి మార్కల షీట్, ప్రభుత్వం అందించిన గుర్తింపు కార్డు (ఆధాకార్డ్/ఓటర్ ఐడి/పాన్ కార్డ్), ఫస్టీయర్ అడ్మిషన్ ప్రూఫ్ (ఫీజు రిసిప్ట్/ఐడికార్డ్/అడ్మిషన్ లెట్టర్/బోనఫైడ్),
కుటుంబ ఆదాయ థ్రువీకరణ పత్రం (ఐటిఆర్ ఫార్మ్ 16/ఇన్‌కమ్ సర్టిఫికెట్/సాలరీ స్లిప్), అకాడమిక్ కోసం వెచ్చించిన రశీదులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోటోగ్రాఫ్ లు అందించాలి.
దరఖాస్తు చేసే విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరితేది: నవంబర్ 30, 2022.
మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయండి: https://www.buddy4study.com