అండర్ వరల్డ్ డాన్ పరిస్థితి విషమం…. విష ప్రయోగం చేసినట్టుగా ప్రచారం

 

దిశ దశ, అంతర్జాతీయం:

భారత దేశానికి మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా డాన్ చనిపోయారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. రెండు  రోజుల క్రితం ఆయనపై విష ప్రయోగం జరగడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దావూద్ సన్నిహితులు వారు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఫ్లోర్ లోకి మాత్రం అతని కుటుంబ సభ్యులను తప్ప ఇతరులెవరిని అనుమతించడం లేదని పాకిస్తాన్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. అయితే అండర్ వరల్డ్ డాన్ గురించి పూర్తి వివరాలు సేకరించేందుకు ముంబాయి పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అతని అతని బంధువులు అలీషా పార్కర్ మరియు సాజిద్ వాగ్లే నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానిస్టేబుల్ కొడుకు డాన్ గా మారి…

అంతర్జాతీయంగా అండర్ వరల్డ్ డాన్ గా పేరుగాంచిన దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 1955 డిసెంబర్ 26న జన్మించాడు. ఓ పోలీసు కానిస్టేబుల్ కొడుకు అయిన దావూద్ నేరాలకు పాల్పడుతూ సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిపోయాడు. 1974లో ముంబాయి నగరంలో డోంగ్రీలో నేరానికి పాల్పడడంతో వెలుగులోకి వచ్చిన ఘటనతో డాన్ గా మారిపోయాడు. ముంబాయిలో 1974 వరకే డాన్ గా ఉన్న పఠాన్ బాషు దాదాపై సోడా సీసాలతో దాడి చేయడంతో దావూద్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆరంభం అయింది. పఠాన్ బాషు దాదాపై దాడి తరువాత హజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్లను కూడా కాలదన్ని నంబర్ వన్ గా ఎదిగాడు. 1950 ప్రాంతంలో స్థానికంగా ఏర్పడిన ముఠాలు కత్తిపోట్లతో పాటు ఇతరాత్ర నేరాలకే పరిమితం అయినప్పటికీ దావూద్ మాఫియా డాన్ గా ఎదిగిన తరువాత అంతర్జతీయ నేరాలు చేసే స్థాయికి వెళ్లాడు.

‘డి’ కంపెనీ పేరిట…

1976లో ‘డి కంపెనీ’ పేరిట పెద్ద పెద్ద నేరాలకు పాల్పడడం ఆరంభించారు. ఈ కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బుల వసూలు, కాంట్రాక్ట్ మర్డర్స్ కు నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. బిగ్ డిగా కూడా ప్రసిద్దికెక్కిన దావూద్ చివరకు చిత్ర పరిశ్రమను కూడా శాసించే స్థాయి చేరుకున్నాడు. సినీ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతూ బాలీవుడ్ ప్రముఖు నటీనటులతో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. ఈయనతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా బాలివుడ్ కు చెందిన ప్రముఖులు అరెస్ట్ అయ్యారు కూడా. అయోధ్య పరిణామాల అనంతరం ఛోటా రాజన్ హిందువుల కుటుంబాల యువకులతో మరో ముఠాను ఏర్పాటు చేసుకోగా, అయోధ్య ఘటనలకు ప్రతీకారంగా 1993 ముంబై వరస పేలుళ్లకు పాల్పడ్డాయి మాఫియా గ్యాంగ్స్ ఈ ఘటనలో కీలక పాత్రధారి టైగర్ మెమన్ దావూద్ ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. ఈ పేలుడు ఘటనల తరువాత దావూద్ భారత్‌లో కనిపించకుండా పోయాడు. 250 మంది మృతికి కారణమైన ఆ పేలుళ్ల వెనుక దావూద్ ఉన్నాడని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

సీరియస్ గా…

ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే చనిపోయి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ గా మారిన దావూద్ కోసం భారత్ కూడా పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతని ఆచూకి మాత్రం దొరకలేదు. పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నాడని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు వాదించినా పాకిస్తాన్ తోసిపుచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే తాజాగా దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వార్తలు వెలువడుతుండడం గమనార్హం.

You cannot copy content of this page