కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్…
దిశ దశ, సిరిసిల్ల:
‘‘ అన్ సాటిస్ఫైడ్ లైఫ్… నో వన్ ఈజ్ రీజన్ ఫర్ దిస్… ఐయామ్ యూజ్ లెస్ ఫర్ ఆల్ జాబ్ లెస్.. ధాంక్యూ టు మై ఫ్యామిలీ… ఐ క్విట్’’ అని లేఖ రాసి ఊరి వేసుకుని చనిపోయాడో నిరుద్యోగి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ కు చెందిన నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇలాకాకు చెందిన యువకుడు ఈ విధంగా రాస్తూ చనిపోవడం గమనార్హం. సంఘటనా వివరాల్లోకి వెలితే… సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నాగభూషణం, సుశీలలకు ముగ్గురు కొడుకుల్లో చిన్న వాడైన నవీన్ కుమార్ (30) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. హోట్ మెనేజ్ మెంట్ చేసిన నవీన్ సాఫ్ట్ వేర్ లో స్థిరపడే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నాడని స్థానికంగా చెప్తున్నారు. ఉద్యోగాణ్వేషనలోనే నవీన్ విసిగి వేసారి పోయి బలవణ్మరనానికి పాల్పడినట్టుగా లేఖను బట్టి స్పష్టం అవుతోంది. నిరుద్యోగిగా బ్రతకలేక… తన చదువుకు సార్థకత దొరకకనే మృత్యువు పంచన చేరిపోయినట్టుగా అర్థం అవుతోంది. మూడు పదుల వయసులో ఉన్న నవీన్ అర్థాంతరంగా తనువు చాలించిన తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనుడిగా మారిపోవడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు.