ఫిబ్రవరిలోనే కేంద్ర బడ్జెట్..?

దిశ దశ, న్యూ ఢిల్లీ:

లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి ముందస్తు బడ్జెట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే బడ్జెట్ సెషన్స్ ఏర్పాటు చేసి ఈ టర్మ్ లో చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నాటికి అన్ని విధాల సిద్దంగా ఉండే విధంగా ముందుగానే బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్న యోచనలో ఉన్నట్టుగా సమాచారం. బడ్జెట్ సమావేశాల అనంతరం ఎన్నికల వాతావరణంతో దేశ వ్యాప్తంగా పర్యటనలు చేయాలన్న యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా సమాచారం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈస్ట్ వెస్ట్ ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరిట 6,200 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేయనున్నారని ప్రకటించిన 24 గంటల్లోనే బీజేపీ కూడా తన దూకుడును పెంచినట్టుగా స్పష్టం అవుతోంది. మార్చి 20 వరకు రాహుల్ గాంధీ యాత్ర ముగిసే సరికి బీజేపీ ముఖ్య నాయకత్వం నుండి సామాన్య కార్యకర్త వరకు పార్టీ బలోపేతం కోసం రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరం కూడా జనవరి 22న ప్రారంభోత్సవం కానున్నందున ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్స్ పూర్తి చేసి కదనరంగంలోకి దూకాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నిర్ణయానికి  ప్రధాని నరేంద్ర మోదీ కూడా అనుకూలంగా ఉన్నట్టుగా  తెలిసింది.

You cannot copy content of this page