దిశ దశ, వరంగల్:
ప్రపంచమంతా ఊర్రూతలూగించే క్షణాలవి… అసలే భారత్ జోరు మీద కొనసాగుతోంది. ఆ ఆనంద క్షణాలు, ఉత్కంఠ భరితంగా కొనసాగే తీరును అస్వాదించాలంటే అభిమానులు క్రికెట్ చూసేందుకు టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి తప్ప మరో అవకాశం లేదు. అందునా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కావడంతో తమ పెళ్లికి అతిథులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన ఆ వరుడు కాస్తా ప్రీ ప్లాన్డ్ గానే ఏర్పాట్లు చేయించారు. ఫంక్షన్ హాల్ కు వచ్చిన గెస్ట్ లంతా కూడా పెళ్లి తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తున్న తంతు కొనసాగుతున్నట్టుగా క్రికెట్ లైవ్ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసేశారు. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన కత్తి శివ వివాహం మామ్నూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. దీంతో తన పెళ్లికి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వరల్డ్ కప్ క్రికెట్ లైవ్ చేయించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉందని నా పెళ్లి రాకుండా తన స్నేహితులు, బంధువులు మిస్ కాకుండా ఉండేందుకు శివ తీసుకున్న చొరవ చూసి ప్రతి ఒక్కరూ అభినందించారు.