ఓ ఏజ్ వచ్చే వరకు తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతారు. ప్యాకెట్ మనీ విషయంలో అయినా, డిసిప్లేన్ లో అయినా ఇలా అన్నింటిలోనూ పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అయితే ఉన్నత కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండవని అనుకుంటుంటాం. కానీ పెద్దల అజమాయిషీ నడుమ పెరిగి పెద్దయిన వారూ ఉంటారు. ఇప్పుడు అదే విధానంలో తాను పెరిగి పెద్దయ్యానని నందమూరి బాలకృష్ణ చెప్పడం గమనార్హం. అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డిలతో UNSTOPPBLE-2 WITH NBKలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య కూడా తన చిన్ననాటి విషయాలను వివరించారు. యవ్వనంలోనూ తనకు కష్టాలు తప్పలేదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగునాట నవరసాలు పండించిన ఎన్టీరామారావు తనయుడు కూడా ఆర్థిక క్రమశిక్షణతోనే పెంచడం చెప్పుకోదగిన విషయం. రెండు మూడు రోజులకోసారి లీటరు పెట్రోల్ బైక్ లో కొట్టించే వారని ఇంధనం అయిపోతే వాహనాన్ని తోసుకుంటూ వెల్లిన సందర్భాలూ ఉన్నాయన్నారు. మేనేజర్ పూర్ణ చందర్ రావు తనకు ఇచ్చేవారని, అయితే ప్రతి పైసా కూడా అకౌంట్లో రాసుకునే ఇచ్చేవారని, ఒక్కో సారి టీ స్టాల్ అతన్ని బ్రతిమాలి ఛాయ్ తాగాల్సి వచ్చేదని వివరించారు బాలయ్య.
అమ్మాయిలంతా బాలా వైపే…
ఓ కాలేజీలో అమ్మాయిల కోసం గోడలపై ఉండి చూసే వారు కదా అని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని బాలకృష్ణ వేసిన ప్రశ్నకు ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారోనని ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే సురేష్ రెడ్డి తామంతా కాలేజీ గోడలపై నుండి అమ్మాయిలను చూసినా లాభం లేకపోయేదని చివరకు బాలయ్య బైక్ పై కాలేజీలోకి ఎంట్రీ ఇవ్వగానే అంతా ఆయన్ను చూసేందుకు ఆసక్తి కనబర్చేవారన్నారు. మరో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు బాలకృష్ణను అభిమానులు, ఇతరులు చాలా మంది కూడా బాలయ్య అని పిలిచే వారు. కానీ ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు మాత్రం ‘బాలా’ అని పిలుస్తారని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా వెలుగులోకి వచ్చింది.