తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్లుగా చేసిన ఆ ఇద్దరు నేతలు ఏమన్నారు..? ఏపీని విభజించే సమయంలో వారు ఎలా ఫీలయ్యారు..? ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారు..? రాష్ట్ర ఆవిర్భాం జరిగిన ఏనిమిదేళ్ల తరువాత వారిద్దరూ కూడా తమల మనసులో మాటలు బయట పెట్టారు. కలిసి చదువుకున్న ఆ ఇద్దరు నేతలు ఎవరూ..?
ఇద్దరూ కాంగ్రెస్ నేతలే..
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఎదిగిన ఈ ఇద్దరు నాయకులు వరస విజయాలతో అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించిన వారే. ఒకరు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు అయితే అయితే మరోకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన కేఆర్ సురేష్ రెడ్డి, చిత్తూరు జిల్లా వాయల్పాడు నియోజకవర్గానికి చెందిన నల్లారి కిరణ్ కుమారెడ్డిలు ‘UNSTOPPABLE-2 WITH NBK’లో తమ సహచర విద్యార్థి అయిన బాలకృష్ణతో పలు అంశాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బాల కృష్ణ విద్యాభ్యాసం చేసినప్పటి స్నేహితులతో కలిసి సరదాగా యాంకరింగ్ చేస్తూ వైవిద్యమైన ప్రశ్నలను సంధించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలు ఎలా ఫీలయ్యారో కూడా ఇందులో వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరగడంపై బాధ పడ్డానన్నారు. దశాబ్దాలుగా పుట్టి పెరిగి అనుభందం పెనవేసుకుని తన సొంత ప్రాంతంగా భావించిన హైదరాబాద్, ఇన్నాళ్లు కలిసి ఉన్న తెలంగాణ వాసులు వేరే రాష్ట్రాంగా విడిపోతున్నారన్న మనోవేదన వెంటాడిందని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం తరువాత మాత్రం అంతా సర్దుకుందని ఇఫ్పుడు ఆ ఫీలింగ్ కు దూరం అయ్యానని అంతా సవ్యంగానే ఉందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి వెల్లడించారు. చిన్న రాష్ట్రాలతోనే ప్రాంతీయ అవసరాలను నెరవేర్చుకునే అవకాశం ఉందని, తెలంగాణాలో గోదావరి, కృష్ణ జలాలను పూర్తి స్ధాయిలో వినియోగించుకునే అవకాశం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదంతో ముందుకు సాగామని, ఇప్పుడు భిన్నత్వమే ఏకత్వం అన్నట్టుగా పరిస్థితులు మారాయన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే లక్ష్యాలను ఛేదించుకునే అవకాశం ఉందని, అయితే నేషనల్ పార్టీలతోనూ దేశం అభ్యున్నతి చెందిందని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
120 ఏళ్ల అనుభందం
మరోవైపున కె ఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో తమ కుటుంబానికి మూడు తరాల అనుభందం ఉండేదని, 120 ఏళ్ల పాటు తాము ఆ పార్టీలోనే కొనసాగామన్నారు. అయితే తెలంగాణలో పరిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయిని ముఖ్యమంత్రి కేసీఆర్ లీడర్ షిప్ ఉంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు ప్రక్రియ లక్ష్యం వైపు వెల్లగలుగుతామన్న నమ్మకంతో టీఆరెఎస్ పార్టీలో చేరానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లీడర్ షిప్ పూర్తిగా వీక్ కావడంతో పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందన్నారు. వీరిద్దరూ కూడా వరసగా ఏపీ అసెంబ్లీకి స్పీకర్లుగా వ్యవహరించడం విశేషం. 2004 వరకు కేఆర్ సురేష్ రెడ్డి, 2009లో కిరణ్ కుమార్ రెడ్డిలు శాసనసభకు అధక్షులుగా వ్యవహరించారు.