ఎవరా ఇద్దరూ.. ?

ఆ మాజీ సీఎం వ్యాఖ్యల వెనక… ?

ఉమ్మడి రాష్ట్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఇంటర్వ్యులో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ‘unstoppable with nbk’ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల వెనక ఏం జరిగింది అన్నదే పజిల్ గా మారింది. అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి తన తండ్రి అమరనాథ్ రెడ్డి విషయంలో అయినా ముఖ్యమంత్రి రాజేశేఖర్ రెడ్డి విషయంలో అయినా చెప్పిన విషయాలను గమనిస్తే వస్తున్న డౌట్లను ఆపేదెవరూ… అన్న చర్చ సాగుతోంది.

తండ్రి విషయంలో…

వైఎస్ మరణం తరువాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కల్పిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి చెప్తే చాలా లైట్ గా తీసుకున్నారట కిరణ్ కుమార్ రెడ్డి. ఈ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పకుండా జాగ్రత్త పడ్డ కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకు అసలు కారణమేంటో కూడా వివరించారు. అంతకు ముందు తన తండ్రి ముఖ్యమంత్రి కావడం ఖాయమై పోయిందని, ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఒక రోజు ముందున కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన ఓ నాయకుడు తనకు క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వాలని వేడుకున్నాడని వివరించారు. అయితే అనూహ్యంగా కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి తన తండ్రిని అభ్యర్థించిన నేతే ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే కాబట్టి తాను ముఖ్యమంత్రి అవుతున్న విషయం ముందుగా తెలిసినా లైట్ గా తీసుకోవల్సి వచ్చిందని వివరించారు నల్లారి.

ఆ రోజు ఏం జరిగిందంటే…

ముఖ్యమంత్రి వైఎస్ మరణానికి ముందు రోజు జరిగిన పరిణామాలే తనను ప్రాణాలతో నిలబెట్టడానికి కారణం అసెంబ్లీ కమిటీల నియామకమేనని చెప్పకనే చెప్పారు. అసెంబ్లీకి సంబందించిన పీఏసీ ఛైర్మన్ ను ప్రతిపక్ష పార్టీ నేతకు అప్పగించాలన్న సాంప్రాదయం కొనసాగుతోందని ఈ క్రమంలో అప్పడు అపోజిషన్ పార్టీగా ఉన్న టీడీపీ పీఏసీ ఛైర్మన్ గా నాగం జనార్దన్ రెడ్డి పేరు ప్రతిపాదించగా వైఎస్ మాత్రం శోభా నాగిరెడ్డికి బాధ్యతలు అప్పగించాలని సూచించారన్నారు. వైఎస్ రాజ శేఖర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా హాజరు కావల్సి ఉంది. ఈ కార్యక్రామానికి వైఎస్ తో కలిసి వెల్లాల్సి ఉన్నప్పటికీ కమిటీల కూర్పు కారణంగా ఆగిపోవల్సి రావడంతో ప్రాణాలతో ఉన్న తాను ముఖ్యమంత్రి అయ్యానన్నారు. అయితే ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అసెంబ్లీ కమిటీలకు బాధ్యులను నియమించే విషయంలో వైఎస్ తో చర్చించినప్పుడు ఫలనా మంత్రి మీతో ఉన్నారా అని తాను అడిగానని వైఎస్ అవునని సమధానం చెప్పారని, ఆ సీనియర్ మంత్రి ఆ ముఖ్యమంత్రిని మిస్ లీడ్ చేస్తుండేవాడని కూడా వివరించారు.

రెండు క్వశ్యన్ మార్కులే…

తన తండ్రి అమరనాథ్ రెడ్డి చేతికి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని చివరి క్షణంలో లాక్కున్నదెవరూ అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నప్పటికీ ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరు అయ్యారో కూపీ లాగితే తెలిసే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రిగా ఏఐసీసీ పెద్దలను కూడా తనకు అనుకూలంగా మల్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ ను ఓ సీనియర్ మంత్రి మిస్ లీడ్ చేసేవారని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. సోనియాగాంధీని సైతం మెప్పించి ఒప్పించే స్థాయికి చేరిన వైఎస్ ను తప్పుదారి పట్టించిన సీనియర్ మంత్రి ఎవరోనన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అన్ స్టాపబుల్ అనుమానాలను ప్రేక్షకుల ముందు ఉంచారన్న డిస్కషన్ స్టార్ట్ అయింది.

You cannot copy content of this page