కరీంనగర్ లో బీభత్సం
మండు వేసవిలో అకాల వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఈ నెల 18న కురిసిన వడగళ్ల వర్షంతో అతలాకుతలం కాగా తాజాగా శుక్రవారం కరీంనగర్ వాసులను అకాల వర్షం కలవరపెట్టింది. మళ్లీ కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ట్రాన్స్ కో అధికారులు యుద్ద ప్రాతిపాదికన విద్యుత్ పునరుద్దరణ కోసం రంగంలోకి దిగారు. మరో వైపున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా కరీంనగర్ సమీప గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోవడంతో నేల కూలిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు. అలాగే రైతుల నుండి సేకరించిన ధాన్యం కూడా తడిచిపోయాయి. అలాగే మొక్కజోన్నతో పాటు ఇతరాత్ర పంటలు కూడా నేలవాలిపోయాయి. దీంతో రైతులు పంటలు చేతికి వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.