దిశ దశ, జాతీయం:
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా యూపీ చరిత్రకెక్కింది. 14వ స్థానంలో ఉన్న యూపీ ఏకకాలంలో రెండో స్థానానికి ఎగబాకినట్టు జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. యూపీ ఏటా రూ. 2 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుండడంతో తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నేతృత్వం ఈ విజయం సాధించడం గమనార్హం. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానం నుంచి రెండో స్థానానికి ఉత్తర ప్రదేశ్ చేరుకోవడం గమనార్హం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల సరసన నిలిచే యూపీ ఆర్థిక పరిపుష్టికి చేరుకోవడం విశేషం.