అప్ డేట్ కాని గూగుల్… పట్టించుకోని అధికారులు

గౌరవెల్లి బ్యాక్ వాటర్ లోకి వెల్లిన వ్యాన్…

దిశ దశ, హుస్నాబాద్:

గూగుల్ మ్యాప్ అప్ డేట్ కాకపోవడంతో మరోసారి ఇబ్బంది తప్పలేదు అక్కడ. తెలంగాణాలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి వెల్లి మరో వాహనం చిక్కుకపోయింది. అయితే గతంలో ఎదురైన అనుభవాన్ని గమనించిన అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేయలేదు. దీంతో ఆ ప్రాజెక్టు ఏరియాలో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగానే మారింది.

గౌరవెల్లి ప్రాజెక్ట్…

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి మరో వాహనం వెల్లింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు డైరీ నుండి వేస్టేజ్ తీసుకెల్తున్న ఓ గూడ్స్ వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ సహాయంతో హైదరాబాద్ కు బయలుదేరారు. ముల్కనూరు నుండి హుస్నాబాద్, రామవరం, కొమురవెల్లి మీదుగా హైదరాబాద్ వెల్లాలని భావించిన డ్రైవర్ హుస్నాబాద్ దాటిన తరువాత గౌరవెల్లి బైపాస్ రోడ్డు సమీపానికి చేరుకున్న తరువాత వ్యానును ఎడమవైపు మీదుగా తీసుకెళ్లాల్సి ఉండగా గూగల్ మ్యాప్ చూపించిన విధంగా కుడివైపునకు తీసుకెళ్లాడు. దీంతో గూడ్స్ వ్యాన్ గౌరవెల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి తీసుకెళ్లాడు డ్రైవర్. చీకట్లో నీటి మధ్యకు చేరిన తరువాత అనుమానించిన డ్రైవర్ వ్యాను దిగి ఈదుకుంటూ వెనక్కి వచ్చాడు. మరునాటి ఉదయం స్థానికుల సాయంతో వ్యానును బయటకు లాగారు. గతంలో కూడా ఇదే విధంగా ఓ లారీ నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి చేరడంతో గ్రామస్థులు జేసీబీ సాయంతో లారీని బయటకు తీయించారు.

ప్రత్యామ్నాయ చర్యలేవి..?

అయితే గూగుల్ మ్యాప్ అప్ డేట్ కాకపోవడంతో రాత్రి వేళ్లల్లో ఈ ప్రాంతం మీదుగా వెల్లే వాహనదారులు గూగుల్ మ్యాప్ పై ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో కావడంతో ఆ రహదారులపై ఎవరూ ఉండకపోవడంతో గూగుల్ పై ఆధార పడడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోతోంది వాహనదారులకు, అయితే గతంలో ఎదురైన అనుభంతో ఇరిగేషన్ అధికారులు కానీ, ఆర్ అండ్ బి అధికారులు కానీ గౌరవెల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వైపు ఉన్న రహదారిపై రోడ్డు స్టాపర్లు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ రోడ్డును సూచిస్తూ ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తే బావుండేది. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఆ దిశగా చొరవ చూపకపోవడంతో రాత్రి వేళల్లో ఈ ప్రాంతం మీదుగా వాహనా దారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో అయితే పోలీసు అధికారులు పకడ్భందీగా రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి రోడ్ డైవర్షన్ చేసినట్టుగా బోర్డులు ఏర్పాటు చేసే ఆనవాయితీ ఈ ప్రాంతంలో కొనసాగుతోంది. కానీ శాశ్వంతంగా ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వైపునకు వాహనాలు వెల్లకుండా ఉండేందుకు అసవరమైన చర్యలు తీసుకునే వారే లేకుండా పోయారి. ఇప్పటి వరకు భారీ వాహనాలు అటుగా వెల్లడం వల్ల ఇబ్బందులు తలెత్తలేదు కానీ ఇతర వాహనాలు వెల్లినట్టయితే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అర్థరాత్రి సమయంలోనే ఈ సమస్య ఎదురవుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page