సామాజిక ఉద్యమ కారుడు మరియు కరీంనగర్ ప్రశ్నించే గొంతుగా పేరు గాంచిన BC నాయకుడు BSP పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుమల్ల విశ్వం కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. విద్యార్థి దశ నుండే సామాజిక సేవే పరామావధిగా భావిస్తూ మహాదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి వేలాది కరీంనగర్ పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఉరుమల్ల విశ్వం బరిలో ఉండడం పట్ల మేధావులు, యువతీయువకులు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కోవిడ్ -19
మొదటి మరియు రెండవ లాక్ డౌన్ సమయంలో 5 వేల మంది ప్రయివేట్ టీచర్లు, న్యాయవాదులు, ఆటోడ్రైవర్లు, వలసకూలీలు మరియు ఇతర బడుగు జీవులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం ద్వారా మానవత్వం చాటుకున్నారు. BC విశ్వకర్మ సామాజిక వర్గం ఓట్లు కరీంనగర్ అసెంబ్లీలో
సుమారు 30 వేల పై చిలుకు ఉండడం తన సొంత సామాజిక వర్గమే కాకుండా ఇతర BC కులాల్లో మంచి పరిచయాలు ఉండడం విశ్వం కు కలిసివచ్చే విషయం. BSP పార్టీ బ్యానర్ లో విశ్వకర్మ సమ్మేళనం, BC సమ్మేళనం, బహుజన సమ్మేళనం, బహుజన ధూమ్ ధామ్ మరియు ఎన్నో BC, SC & ST ప్రజల కోసం కార్యక్రమాలు చేసిన విషయాలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ పట్టణంలో అందరికి సుపరిచితుడైన విశ్వం ను బరిలో నిలిపే యోచనలో BSP పార్టీ అధిష్టానం మరియు రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. RS ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చిన నాటినుండి తన అడుగు జాడల్లో నడుస్తూ బహుజన ఉద్యమంలో పని చేస్తున్న విశ్వం ను BSP టికెట్ ఇవ్వాలని RS ప్రవీణ్ కుమార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
Disha Dasha
1884 posts
Next Post