ఈ సంక్రాంతికి టాలీవుడ్ షేక్ అవ్వ నుంది. బిగ్ స్టార్స్ పోటీ పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణలు భారీ టార్గెట్‌తో దిగుతున్నారు. అలాగే సంక్రాంతి బరిలో ఈ సారి తమిళ సినిమాలు కూడా బరిలో దిగనున్నాయి. బాల కృష్ణ వీర సింహా రెడ్డితో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అంటూ వస్తున్నాడు. ఈ రెండింటిలో వీర ఉన్నట్టు.. సినిమాలు కూడా వీర లెవల్లో ఉంటాయని అభిమానులు వేచి చూస్తున్నారు. పైగా రెండు సినిమాలు మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. వీటితో పాటు విజయ్ ‘ వారసుడు ‘, అజిత్ ‘ తెగింపు ‘ సినిమాలు కూడా విడుదలవ్వనున్నాయి.
సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కంటే ముందుగా అజిత్ తెగింపు ” సినిమా ” వస్తోంది. జనవరి 11న ఈ సినిమా విడుదలవ్వబోతుంది. ఆ తరువాత బాలకృష్ణ రంగంలోకి దిగుతాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమా , జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు విడదలవ్వబోతున్నాయి . జనవరి 14న విజయ్ ” వారసుడు ” సినిమా మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుందో అనేది విడుదలయ్యే వరకు చెప్పలేం.
వీర సింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈ విధంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. విడుదలయ్యాక 74 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ కొట్టినట్టే. ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాంలో – రూ.15 Cr
సీడెడ్‌లో – రూ.13 Cr
ఉత్తరాంధ్రలో – రూ.9 Cr
ఈస్ట్ – రూ. 5.2 Cr
వెస్ట్ – రూ.5 Cr
గుంటూరు – రూ. 6.4 Cr
కృష్ణా – రూ. 5 Cr
నెల్లూరు – రూ. 2.7 Cr