ఏసీబీ కేసులో తప్పుడు సాక్ష్యం… ముగ్గురిపై కేసు నమోదు

దిశ దశ, కరీంనగర్:

ఏసీబీ కేసులో నిందితునికి జైలు శిక్ష పడగా… బాధితులపై కేసు నమోదు అయింది.
అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించి… కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పినట్టయితే వారిపై కూడా క్రిమినల్ కేసు నమోదు కావడం ఖాయమని మరోసారి స్పష్టం చేసింది. తాజాగా ముగ్గురు పిటిషనర్లపై కేసు నమోదు కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టు నిర్ణయించింది. సంఘటన వివరాల్లోకి వెళితే… 2010లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరుకు చెందిన రైతులు 11కెవి ట్రాన్స్ ఫార్మర్ అవసరం ఉందని ఇచ్చోడ ఏడీఈ దరఖాస్తుకు చేశారు. ఈ దరఖాస్తును ఫార్వార్డ్ కోసం ఏడీఈ రేగుంట స్వామి మొదట రూ. 30 వేలు లంచంగా అందించడానికి అభ్యర్థించగా, ఇచ్చుకోలేమని చెప్పిన రైతులు రూ. 20 వేలు అయినా ఇవ్వాలన్నాడు. అంతకూడా ఇచ్చే పరిస్థితిలో లేమని రైతులు వేడుకగా రూ. 15 వేలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. బాధిత రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏడీ స్వామిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కెమికల్ పరీక్షల అనంతరం ఇతర సాక్షుల వాంగ్మూలం తీసుకున్న ఏసీబీ అధికారులు ఏడీ స్వామిని అరెస్టు చేశారు. 2016లో కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో ఈ కేసు ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. గత సంవత్సరం ఏప్రిల్ 10న ఈ కేసులో నిందితుడు స్వామికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో బాధితులు అయిన కన్నమయ్య, నేతల నారాయణ, మల్లయ్యలు విచారణ సమయంలో కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పారు. అయితే ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టిన కెమికల్ పరీక్షల రిపోర్ట్, ఇతర సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న కోర్ట్ ఏడీ స్వామికి శిక్ష విధించింది. జడ్జిమెంట్ తర్వాత బాధితులు అయిన ముగ్గురికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసిన కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్ట్ సంజాయిషీ ఇచ్చింది. గత సంవత్సరం ఏప్రిల్ నుండి ఇప్పటి వరకూ కన్నమయ్య, నారాయణ, మల్లయ్యల నుండి స్పందన లేకపోవడంతో ముగ్గురిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. 

You cannot copy content of this page