అభ్యర్థుల ఆరోపణ
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధికారుల చుట్టూ ఉచ్చు బిగించక తప్పేలా లేదు. హై కోర్టు ఆదేశంతో స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసిన తరువాత లోపల ఉన్న తీరుపై పలువురు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్ట్రాంగ్ రూంలోని బాక్సులకు తాళాలు లేవని, ఉన్న వాటి కీస్ కూడా మిస్సయ్యాయని ఆరోపించారు. మరో వైపున నయా భారత్ పార్టీ అభ్యర్థి దూడ మహిపాల్ కూాడా స్ట్రాంగ్ రూంలో ఏం జరుగుతుందోనన్న విషయం మీడియాకు వివరించారు. ఈవీఎం, ఫామ్స్ కు సంబంధించిన ట్రంక్ పెట్టెలు కూడా క్రమ పద్దతిలో ఏర్పాటు చేయలేదని అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలో రికార్డు చేసిన సీసీ ఫుటేజీ కూడా స్ట్రాంగ్ రూంలో కనిపించకుండా పోయిందని వివరించారు.
అడగడుగునా నిర్లక్ష్యం
ధర్మపురి ఎన్నికల ఫలితాలపై హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణ జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం అడగడుగునా వైఫల్యం చెందినట్టుగా స్పష్టమవుతోంది. తాళం చెవుల అదృశ్యం కావచ్చు, సీసీ ఫుటేజీ కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా ఎన్నికల కమిషన్ నిభందనలను పాటించనట్టుగా స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఈసీఐ కూడా సీరియస్ గా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా ఎన్నికల అధికారి లేదా జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి సేఫ్ కస్టడీలో ఉండాల్సిన స్ట్రాంగ్ రూం కీస్ ధర్మపురి ఆర్వో కార్యాలయంలో లభ్యం కావడం నుండి మొదలు ఆదివారం స్ట్రాంగ్ రూంలోపల ఉన్న రికార్డులు, సీసీ ఫుటేజీ వరకు అన్ని కూడా మిస్సింగ్ మిస్టరీతోనే ముడిపడి ఉండడం అభ్యర్థుల అనుమానానికి కారణమవుతోంది. స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసిన తరువాత వెలుగులోకి వచ్చిన విషయాలపై కూడా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కూమార్ హై కోర్టులో మరో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post