దిశ దశ, వేములవాడ:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. మంగళవారం రాజన్న క్షేత్రంలోని లడ్డు తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ తో తూకంతో పాటు నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆలయ స్టార్ రిజిస్టర్లు, వాస్తవానికి ఉన్న నిలువలతో పోల్చి చూస్తున్నారు. అయితే గతంలో కూడా పలుమార్లు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటనలు కూడా ఉన్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ తంతు సాగుతోందని తెలుస్తోంది.
