దిశ దశ, భూపాలపల్లి:
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వర్కింక్ ప్రసిడెంట్ గా భూపాలపల్లి జిల్లా వాసి ఎంపికయ్యారు. జిల్లాలోని మహధేవపూర్ మండల కేంద్రానికి చెందిన పామరాజు విజయ్ కుమార్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… బ్రాహ్మణ సేవా సమితి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడి వారికి అన్ని వేళల్లో బాసటగా నిలుస్తానన్నారు. సంఘటితంగా ముందుకు సాగి పేద బ్రాహ్మణులకు అవసరమైన సాయం అందించేందుకు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు తనకు అప్పగించే పనులను పూర్తి చేసి సంఘ అబివృద్దే లక్ష్యంగా పనిచేసేందుకు శ్రమిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు, కోశాధికారి ఆర్కే దేష్ ముఖ్, కోశాధికారి మంత్రి సునీల్, రాష్ట్ర సహామ కార్యదర్శి అక్కిరాజు దుర్గా ప్రసాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణదాసు గోపాలరావు, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి దేవరపల్లి అశోక్ తదితులు పాల్గొన్నారు.