దిశ దశ, నిజామాబాద్:
రికార్డుల్లో ఉన్న వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు కూడా లంచం అడుగుతున్నారు కొందరు ప్రభుద్దులు. అవినీతి పరుల తీరుతో విసిగి వేసారిపోతున్న జనం ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోని లంచావతారాలు పద్దతి మార్చుకునేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. చివరకు బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలకేంద్రంలోని గ్రామ కార్యదర్శి ఈసపల్లి నవీన్ కుమార్ ఈ పంచాయితీలో ఇంటి వివరాలు అప్ లోడ్ చేసేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.