అక్కడ ప్రతి క్షణం ఆ పండగను తల్చుకుంటారు…

ఆ పర్వదినం పేరు తీయకుండా అసలే ఉండలేరు…

దిశ దశ, శ్రీకాకుళం:

సాధారణంగా ఏడాదికోసారి వచ్చే పర్వదినం ఎప్పుడొస్తుంది..? సాంప్రాదాయ బద్దంగా ఆ రోజున ఏం చేయాలి అని తెలుసుకుంటుంటాం. పర్వదినం ముగిసిన వెంటనే మరో పండగ గురించి ఆలోచించడం కామన్ గా జరుగుతుంటుంది. కానీ అక్కడ మాత్రం ఆ ఒక్క పండగ పేరు మాత్రమే క్షణం క్షణం తల్చుకుంటుంటారు. ఆ పేరు చెప్పకుండా ఉండలేని పరిస్థితి ఆ గ్రామాల వారిది. ఏడాదంత వచ్చే పర్వదినాలు అంగరంగవైభవంగా జరుపుకోవడం ఆయా గ్రామాల వాసులు సాధరణమే అయినా… ఈ పండగ మాత్రం ఆ గ్రామాల పేరిటే చేసుకుంటుంటారు. దేశంలోనే అత్యంత అరుదైన గ్రామాలు ఆంధ్రపదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. ఆ గ్రామల పేరు వినగానే ఆశ్చర్యపోవడం కామన్. అలాగే ఆ గ్రామం పేరు వెరైటీగా ఉందని మనసులో అనుకుంటుంటాం… ఆ తరువాత మర్చిపోతుంటాం. కానీ వెరైటీగా ఉన్న ఆ గ్రామాల గురించి తెలుసుకోండి మీరే…

శ్రీకాకుళం…

తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఉత్తారంధ్ర ప్రాంతంలో ఉండే ఈ జిల్లా కేంద్రం ఏడు రోడ్ల కూడలికి కూడా ప్రసిద్ది. ఎంతో చారిత్రాత్మాక నేపథ్యం ఉన్న ఈ జిల్లాకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. నరకాసుర వధ జరిగిన రోజు కాబట్టి దేశమంతా కూడా ‘దీపావళి’ జరుపుకుంటుంటాం కదా ఈ పండగ పేరిటనే ఈ జిల్లాలో రెండు గ్రామాలు ఉన్నాయి తెలుసా. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మాచలేశ్వర స్వామి వెలిసిన శ్రీకూర్మంకు వెల్లే దారిలో ఉంటుంది గ్రామం. వేల సంవత్సరాల క్రితమే ఈ గ్రామానికి దీపావళి అని నామకరణం జరిగింది. గారా మండలంలోని సముద్ర తీరంలో ఉన్న ఈ గ్రామానికి దీపావళి అనే పేరెలా వచ్చిందంటే… కళింగ రాజుల పరిపాలిస్తున్నప్పుడే ఈ పేరు పెట్టారని స్థానికులు పూర్వకాలం నాటి కథనం చెప్తుంటారు. ఓ రోజు కళింగ రాజు తన పర్యటనలో భాగంగా గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెల్తుండగా సృహ తప్పి పడపోవడంతో గ్రామస్థులు రాజుకు సపరిచర్యలు చేస్తారు. అపస్మారక స్థితి నుండి తేరుకున్న రాజు గ్రామస్థులు అందించిన సేవలకు సంతోషం వ్యక్తం చేస్తాడు. అయితే తనకు సేవలందించిన ఈ ఊరి పేరు ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో సపరిచర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరేంటని అడగగా తమ గ్రామానికి ఎలాంటి పేరు లేదని వారు బదులిచ్చారు. దీంతో రాజు సృహ తప్పి పడిపోయిన తనకు సేవలందించారన్న కారణంగా ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టారని గ్రామస్థులు చెప్తుంటారు. అప్పటి నుండి గమ గ్రామానికి ఆ పేరు అలాగే ఉండిపోయిందని తమ పూర్వీకులు ఈ విషయాన్ని తమకు చెప్తుండేవారని గ్రామస్థులు చెప్తున్నారు.

టెక్కలి సమీపాన…

ఇకపోతే ఇదే జిల్లాలో మరో గ్రామానికి కూడా దీపావళితో అనుబంధం శాశ్వతంగా ఉండిపోయింది. జిల్లాలోని టెక్కలి సమీపంలో ‘దీపావళి పేట’పేరిట ఓ గ్రామం కూడా ఉంది. వందేళ్ల క్రితం విద్యుత్ సరఫరా లేన కాలంలో ఈ గ్రామంలో నివసించే వారంతా కూడా దీపాలతోనే కాలం వెల్లదీసేవారు. అప్పుడున్న స్థితిగతుల ప్రకారం గ్రామస్థులు పూరి గుడిసెల్లోనే జీవించే వారు. ఈ క్రమంలో సాయంత్రం కాగానే వెలుతురు కోసం గ్రామంలోని పూరి గుడిసెల్లో దీపాలు వెలిగించేవారు. ఓ రోజున ఎలుకలు ఈ గుడిసెల్లో వెలిగించిన దీపాలను కింద పడేయడంతో మంటలు అంటుకుని గ్రామంలోని గుడిసెలన్ని కూడా దగ్దం అయిపోయాయి. ఆ తరువాత గ్రామస్థులు నివాలను ఏర్పర్చుకున్న తరువాత గ్రామాన్ని దీపావాళిపేట గా నామకరణం చేశారు. అప్పటి నుండి కూడా ఈ గ్రామాన్ని ఇదే పేరుతో పిలుస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. దేశంలోని వారంతా కూడా ఏడాదికొక్కసారి జరుపుకునే దీపావళి గురించి అడపాదడపా మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఈ రెండు గ్రామాల వారు మాత్రం ప్రతి క్షణం దీపావలి నామస్మరణ చేస్తూనే కాలం వెల్లదీస్తుంటారు. అరిసవెల్ల సూర్యాలయం, శ్రీకూర్మం, మహాలింగం, ఏడు రోడ్ల కూడలి వంటి చారిత్రాత్మకతనే కాకుండా జీడి, పనస తోటలతో పాటు ఎన్నో విశిష్టతలకు ప్రసిద్దిగాంచిన శ్రీకాకుళం జిల్లాకు ‘దీపావళి’తో శాశ్వత అనుబంధం ఏర్పడిపోయింది.

You cannot copy content of this page