‘‘నీ కోసం’’ డ్యాన్స్ ఎఫెక్ట్… ఇద్దరిపై చర్యలు… ఒకరు సస్పెన్షన్… మరోకరు వీఆర్ కు

 

దిశ దశ, భూపాలపల్లి:

ఆరోగ్యం కోసం ఎక్సర్ సైజ్ చేయడమేమో కానీ… ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఎన్నికల కోడ్ అమలవుతున్న వేళ రాజకీయ నాయకులు అచి తూచి అడుగు వేయాలన్న విషయాన్ని విస్మరిండచం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ ఘటన ప్రత్యక్ష్యంగా నిలుస్తుంది. ఇష్టారీతిన వ్యవహరిస్తే మెయిన్ మీడియాకన్న ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుందని మరోసారి రుజువైంది. తాజాగా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో జడ్పీటీసీ భర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడం… ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేయడానికి కారణమైంది.

ఉన్నతాధికారుల సీరియస్…

లోకసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎలక్ట్రానికి మీడియాలో ప్రసారం కావడం…సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఉదయం వాకింగ్ కని వెల్లిన జడ్పీటీసీ అరుణ భర్త గుడాల శ్రీనివాస్ స్టేషన్ కార్యాలయంలో నీకోసం నీకోసం పాటపై డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను శ్రీనివాస్ తన మొబైల్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. చేతులారా తాను చేసిన తప్పిదాన్ని సమాజానికి అస్త్రంగా అంధించడంతో రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారం గురించి ఆరా తీశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి తెలిసిన వెంటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కూడా ఆరా తీయించారు. అసలేం జరిగింది… స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు డ్యాన్స్ చేయడానికి కారణాలు ఏంటీ అన్న వివరాలపై అత్యవర నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయగా, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ)ను వెకెన్సీ రిజర్వూకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లోకసభ ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు విధుల్లో తప్పులు చేస్తే ఊపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసుల పనితీరు ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి కానీ దిగజార్చే విధంగా ఉండకూడదన్న విషయం జిల్లా యంత్రాంగం గుర్తుంచుకోవాలన్నారు.

బందోబస్తులో ఎస్ హెచ్ ఓ..?

రెండు రాష్ట్రాల సరిహధ్దున ఉన్న మహదేవపూర్ ఏరియాలో సోమవారం పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో జిల్లా పోలీసులు గస్తీ చర్యలు ముమ్మరం చేశారు. బార్డర్ లో భద్రతా చర్యలు చేపట్టే పనిలో మహదేవపూర్ ఎస్ హెచ్ ఓ ప్రసాద్ నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. బందోబస్తులో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో విధుల్లో ఉన్న స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ప్రసాద్ ను వెకెన్సీ రిజర్వూకు బదిలీ చేశారు జిల్లా ఎస్సీ కిరణ్ ఖరే. వైనల్ వీడియో ఘటనతో ఆయన ఏమాత్రం సంబంధం లేకున్నప్పటికీ స్టేషన్ ఇంఛార్జీగా బాధ్యతల్లో ఉన్నందున ప్రసాద్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page