దిశ దశ, అయోధ్య:
ఓ వైపున అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన వీఐపీల రాకపోకలతో బిజీబిజీగా ఉంటే… మరో వైపున అయోధ్య వీధుల్లో క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సందడి చేశాడు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా విరాట్ ను గమనించిన జనం ఆయన చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. సెల్ఫీ మోజులో కొంతమంది కొహ్లీని నెట్టేశారు కూడా. ఇంతకీ ఏం జరిగిందంటే … విరాట్ కొహ్లిని పోలిన యువకుడు క్రికెట్ ప్లేయర్ డ్రెస్ వేసి, విరాట్ కొహ్లీ అని రాసి ఉన్న టీ షర్టను వేసుకుని మరీ అయోధ్యలో సందడి చేశాడో యువడుకు. విరాట్ కొహ్లీని పోలీనిట్టుగా ఉండడమే కాకుండా ఆయనలాగానే కంటి అద్దాలు కూడా వినియోగించడంతో అంతా కూడా కొహ్లీనే అనుకున్నారు. తీరా దగ్గరకు వెల్లే సరికి కొహ్లీ కాదని నిర్దారించుకున్నప్పటికీ అసలు విరాట్ నయితే కలిసే అవకాశం లేదు కదా అని అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. స్థానికులు. దీంతో ఆయన చుట్టూ చేరిన జనం అంతా కూడా నెట్టుకోవడం, చివరకు అయనను కూడా నెట్టేయడం చేశారు. దీంతో డూప్లికేట్ విరాట్ కొహ్లీ కూడా అసహనం వ్యక్తం చేశాడు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టలో స్పెషల్ అట్రాక్షన్ కోసం ప్రయత్నించిన ఆ యవకుడిని జనం చుట్టుముట్టేసి, నెట్టేయడంతో ఆయన ప్రాణాల మీదకు వచ్చింది.