దిశ దశ, ఖమ్మం:
నోటుకు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు సామాన్యులు. ఐదేళ్ల పాటు పాలించే వారిని ఎన్నుకునే విధానంలో డబ్బులకు ఓటు అమ్ముకునేందుకు తాము సిద్దంగా లేమంటూ సామాన్యులు కుండబద్దలు కొడుతున్నారు. రూ. 5 వేలయినా ఇచ్చి గెలుస్తామని ధీమాగా ఉండే అభ్యర్థులకు చెంపపెట్టులా ఓటర్లు తేల్చి చెప్తున్నారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చన్న ధీమాతో ఉన్న వారికి కూడా ఈ ఫ్లెక్సీ ఓ గుణపాఠం చెప్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఓ ఇంటి ముందు వెలిసిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీ ప్రత్యేకంగా ‘‘ఎక్స్’’ ద్వారా షేర్ చేశారు. మీ ఓటు ద్వారా మీ మీ గళాన్ని వినిపించండి అంటూ కామెంట్ చేశారు. ఇంటి యజమాని కూడా ఫ్లెక్సీపై రాయించిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. ‘‘ తల రాతలు మార్చగల ఏకైక ఆయుధం ఓటు, నా ఓటును కొనగలిగినంత ధనవంతుడు ఈ రాష్ట్రంలో లేడు, ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని రాయించారు. సామాన్యుడి చేతిలో పాశు పతాస్త్రం అయిన ఓటు విలువను వివరిస్తూనే తాము మాత్రం డబ్బులకు అమ్ముడుపోమని స్ఫష్టం చేశారు.
https://x.com/SpKothagudem/status/1784088179538375092?t=C3D743tG292O8Kj4PBs91w&s=08