కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పెళ్లిపై ఓపెన్ అయ్యారు. రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయం ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. 50 ఏళ్లు పైబడినా ఇప్పటికీ రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడం హాట్‌టాపిక్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఎందుకు ఉన్నారనే దానిపై డిబేట్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో తన పెళ్లిపై ఎట్టకేలకు రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ దానికి కండీషన్లు పెట్టారు. మంచి ప్రేమ చూపించే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని, తన మనస్సుని అర్ధం చేసుకునే అమ్మాయి కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకానీ ఫలానా క్వాలిటీస్ ఉండాలని ఎలాంటి లిస్ట్ పెట్టుకోలేదని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ పర్సనల్ విషయాలు పంచుకున్నారు.
భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ.. కర్లీ టేల్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తిండి విషయంలో తాను పెద్దగా పట్టించుకోనని, ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తానని చెప్పారు. తనకు బఠాణీ, పనసపండు అంటే అసలు ఇష్టం ఉండదని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా అన్ని రాష్ట్రాల వంటకాలను రుచి చూశానని, తెలంగాణ వంటకాలు ఘాటుగా అనిపించాయని అన్నారు. తెలంగాణ పుడ్ లో కాస్త కారం ఎక్కువ ఉంటుందన్నారు.
తాను నాన్ వెజిటేరియన్ అని, చికెన్, మటన్ బాగా తింటానని తెలిపారు. రోజు ఉదయం ఓ కప్పు కాఫీ ఖచ్చితంగా తాగుతానని చెప్పారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. మంచి తెలివి, ప్రేమ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడం ఖాయమని చెప్పారు. అలాగే చదువు పూర్తయ్యాక తాను లండన్ లో ఉద్యోగం చేశానని, తన తొలి జీతం 2500 పౌండ్లుగా తెలిపారు.