వక్ఫ్ బోర్డు భూముల కబ్జాపై ప్రచారం

కాంగ్రెస్ మైనార్టీ సెల్ కరపత్రాల పంపిణీ

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేశారని ఆరోపణల పర్వం చేసిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్, వక్ఫ్ ఆస్థుల పరిరక్షణ కమిటీ నాయకులు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రి గంగుల కమలాకర్ ఖాజీపూర్ లోని వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ శుక్రవారం కరపత్రాల పంపిణీ చేపట్టారు. మైనార్టీల అండదండలతో గెలిచిన గంగుల కమలాకర్ తమకు సంబంధించిన ప్రాపర్టీనే స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్ని కూడా మైనార్టీలకు తెలియాలనే ఉద్దేశ్యంతోనే కరపత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు చెప్తున్నారు. ఖాజీపూర్ లోని 14 ఎకరాల వక్ఫ్ భూమిలో ఫామ్ హౌజ్ కట్టుకుని కోట్లాది రూపాయల రుణం కూడా మంత్రి గంగుల కమలార్ తీసుకున్నారని, గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ కు ఓటు వేసి గెలిపించినందుకు ముస్లిం సమాజానికి ఇచ్చిన కానుకనా అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సమద్ నవాబ్ మైనార్టీలకు వివరించారు. వాస్తవంగా వక్ఫ్ ఆస్తుల వల్ల వచ్చే ఆదాయంలో 97 శాతం పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని కానీ ఈ విధానం కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో వక్ఫ్ పరిరక్షణ సమితి, కాంగ్రెస్ నాయకులు రహ్మత్ హుస్సేన్, ఎండి తాజుద్దీన్, అఖీల్, ఎస్ఎ మొహసీన్, ఖమరుద్దీన్, ఇర్ఫాన్, నిహల్, లయీఖ్, చాంద్, ఫిరోజ్, అహ్మద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page