కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపణ
దిశ దశ, వరంగల్:
నేడో రేపో ఆధునిక వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటున్న వరంగల్ సెంట్రల్ జైలును బ్యాంకులో తనఖా పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత బక్క జెడ్సన్ ఆరోపించారు. మంగళవారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని రూ. 1150 కోట్ల కోసం కుదువ పెట్టారని ఆరోపించారు. మహారాష్ట్రలోని పూణే నగరంలోని లోకిమంగల్ శివాజి నగర్ బ్రాంచ్ లో గత సంత్సరం సెప్టెంబర్ 1న ఈ రుణంమ తీసుకున్నారన్నారు. ఇందుకోసం తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్స్ కార్పోరేషన్ ఎండీ డాక్టర్ రమేష్ రెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్ స్థలాన్ని మార్ట్ గేజ్ చేసుకుని రుణం తీసుకున్నారని జెడ్సన్ ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజల ఆస్థులను కూడబెట్టిన విషయంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేశానని, తాజాగా వరంగల్ సెంట్రల్ జైలు స్థలం తనఖా పెట్టిన విషయంపై కూడా ఫిర్యాదు చేయనున్నానని ఆయన వెల్లడించారు.
గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందే
వివిధ రకాల నేరాలకు పాల్పడిన వారిని ఉంచే సెంట్రల్ జైలును కూడా తనఖా పెట్టి చరిత్ర సృష్టించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును చేర్చాల్సిందేనని బక్క జడ్సన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే జైలును కుదవ పెట్టిన వారెవరూ లేనందున మొట్టమొదటి సారిగా జైలు భూమిని మార్ట్ గేజ్ చేసినందుకు సీఎం పేరును గిన్నిస్ బుక్ చరిత్ర పుటల్లోకి ఎక్కించాల్సిందేనని ఎద్దేవ చేశారు. తాను ఆధారాలను కూడా చూపిస్తున్నాని తప్పయితే తనను జైలుకు పంపించాలని, తాను బెయిల్ కూడా తీసుకోనని బక్క జడ్సన్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్ట్ చేస్తాం చేస్తామంటూ చెప్తున్న బీజేపీ నాయకులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు.111 జీఓ రద్దు గురించి మాట్లాడడం లేదని, ఇలాంటి అక్రమాలను కూడా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కుదుపెట్టినవి చాలా ఉండొచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ వరంగల్ ఖిల్లాను కూడా పెట్టరేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసుల వాకీటాకీలు కూడా…
ట్రాఫిక్ రూల్స్, ఎంవీ యాక్టు అమలు చేస్తున్న పోలీసులు సాధారణ పౌరుల వాహనాలను ఎలా సీజ్ చేస్తున్నారే అదే విధంగా వారి చేతిలో ఉన్న వాకీటాకీలు, వాహనాలు సైతం బ్యాంకు జప్తు చేసే అవకాశం ఉందని వాటన్నింటిని కూడా తాకట్టు పెట్టారంటూ బక్క జెడ్సన్ మండిపడ్డారు.
https://twitter.com/zson_bakka/status/1660922774343516160?t=P29WOLEks-trh2YyyBo2Og&s=08
Disha Dasha
1884 posts