ఖలిఫా అధ్యక్షుని ఎన్నిక కోసమేనా..?

దిశ దశ, వరంగల్:

ఈ నెల 25న చెన్నై ఎయిర్ పోర్టులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులోకి తీసుకున్న జకారియా శ్రీలంక ఎందుకు వెల్తున్నాడు..? అక్కడి నుండి పాకిస్తాన్ వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు..? అతని వద్ద పాకిస్తాన్ కు సంబంధించి లిటరేచర్ ఉండడానికి కారణమేంటి..? అన్న కోణంలో NIA అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలోని జాన్ పీరీలో నివాసం ఉంటున్న జకారియా నగరంలోని శివనగర్ అండర్ బ్రిడ్జి సమీపంలో ఓ బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ బిర్యానీ సెంటర్ తో పాటు మరిన్ని బ్రాంచులు ఉన్నాయని, అలాగే కోవాలాంటి పదార్థాలను మొబైల్ మార్కెటింగ్ ద్వారా విక్రయించేందుకు 16 వరకు ట్రాలీ ఆటోలు కూడా అతనికి ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరైన జకారియా 25 ఏళ్ల క్రితం గుంటూరు నుండి వరంగల్ జిల్లాకు వచ్చి సెటిల్ అయినట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు పాకిస్తాన్ నుండి వచ్చి సెటిల్ అయ్యాడని కూడా నగరంలో ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఆయన గురించి సమగ్ర సమాచారం మాత్రం అధికారికంగా వెలువడడం లేదు. ముస్లిమిన్ జమాతే ఆల్ ఇండియా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 25న శ్రీలకం వెల్లేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకోగా ఆయనను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీలంక నుండి షిప్ ద్వారా పాకిస్తాన్ కు చేరుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా సమాచారం. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పాటయిన ఖలిపా అధ్యక్ష్య పదవికి జరుగుతున్న ఎన్నికలకు హజరయ్యేందుకు ఆయన వెల్తున్నాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఖలిపా అంటే..?

భారత దేశంలో వివిధ పేర్లతో జమాతేలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా దేశ వ్యాప్తంగా మత సంబంధిత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పలు పేర్లతో ఉన్న జమాతేలన్నింటికి కూడా జాయింట్ యాక్షన్ కమిటీ మాదిరిగా ఖలిపా అనే ఆర్గనైజేషన్ పరిధిలోకి వస్తాయని తెలిసింది. ఖలిపా బాధ్యులు ఇచ్చే సూచనలకు అనుగుణంగా ఇండియాలో కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సమాచారం. ఖలిపా అధ్యక్షుడు ఇటీవల మరణించాడని ఆ స్థానంలో మరోకరికి బాధ్యతలు అప్పగించేందుకు ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్టుగా సమాచారం. ఈ ఎన్నికల్లో ఖలిపా అద్యక్షుడిని ఎన్నుకునేందుకే జకారియా ముస్లిమిన్ జమాతే జాతీయ అధ్యక్షుని హోదాలో పాల్గొనేందుకు వెల్తున్నట్టుగా విచారణలో తేలింది. అయితే ఇతనికి టెర్రిరిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేవా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. ముస్లిమిన్ జమాతే అనేది గుర్తింపు పొందిన సంస్థ అని అతనికి ఉగ్ర సంబంధాలు అయితే లేవని కూడా చెప్తున్నారు. ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన పుస్తకాలు అతని వద్ద లభ్యం అయ్యాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జనవరి 25న వెల్లిన జకారియాను తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడడంతు అతను ఎన్ఐఏ అధుపులో ఉన్నట్టుగా బయటకు వచ్చింది. రెండు మూడు రోజుల్లో ఇంటికి చేరుకుంటానని జకారియా చెప్పారని కూడా అంటున్నారు.

ఇంటర్నేషనల్ కాల్స్…

కొంతకాలంగా ఎన్ఐఏ జకారియా కదలికలపై నిఘా వేసినట్టుగా స్పస్టం అవుతోంది. తరుచూ అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతుండడం పాకిస్తాన్ దేశీయులతో టచ్ లో ఉంటున్నట్టుగా గుర్తించడంతోనే ఆయనపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించి ఉంటుందని తెలుస్తోంది. ఆయన గురించి వివరాలను సేకరించిన తరువాత స్ఫష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖలిపా సంస్థ గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంస్థ బాధ్యుల గురించి కూడా వాకబు చేయున్నట్టుగా తెలుస్తోంది.

మత ప్రచారమేనా..?

అయితే జకారియా గురించి వెలుగులోకి రాగానే స్థానిక రాష్ట్రంలోని నిఘా వర్గాలు కూడా అప్రమత్తం అయ్యాయి. అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా సమాచారం. అతను ముస్లిమిన్ జమాదే ద్వారా మత ప్రచారం చేసే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే తేలిందని సమాచారం.

You cannot copy content of this page