ఎండల తీవ్రతను తట్టుకునేందుకు సూపర్బ్ స్కెచ్…

దిశ దశ, కరీంనగర్:

భానుడి భగభగలతో కరీంనగర్ అల్లాడిపోతోంది. ఉదయం 10 గంటలు దాటిన తరువాత నగర వాసులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పట్టపగలు అయితే కర్ఫ్యూ వాతావరణాన్ని మరిపిస్తోంది. తెలంగాణలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి వాతావరణం ఓ అద్భుతమైన ఐడియాతో పెట్రోల్ బంక్ ఓనర్ ఏర్పాట్లు చేశారు. అప్పటి వరకు మండుటెండల బారిన పడిన వాహనదారులు ఆ బంకు వద్దకు చేరుకోగానే కూల్ అవుతున్నారు.

జ్యోతినగర్ పెట్రోల్ బంక్…

కరీంనగర్ లోని జ్యోతి నగర్ మల్కాపూర్ రోడ్ లోని ఓ పెట్రోల్ బంక్ యజమానికి కాస్త వైవిద్యంగా ఆలోచించి సూర్యుని ప్రభావం తగ్గించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఎండలో జర్నీ చేసి వస్తున్న వాహనదారులకు ఉపశమనం కలుగుతోంది. పెట్రోల్ బంక్ కు ప్రత్యేకంగా స్పింక్లర్లను ఏర్పాటు చేసి నీటి జల్లులను కురిపిస్తున్నారు. రోజూ మద్యాహ్నం వేళల్లో 4 నుండి 5 గంటల వరకు పెట్రోల్ బంక్ చుట్టూ ఏర్పాటు చేసిన ఈ స్పింక్లర్ల ద్వారా వాటర్ స్ప్రే చేస్తున్నారు. దీంతో ఈ బ్యాంక్ వద్ద గ్రీష్మ ప్రతాపం కొంతమేర తగ్గుతోంది. అప్పటి వరకు కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల మీదుగా ట్రావెల్ చేసి బంకు వద్దకు చేరుకుంటున్న కన్జ్యూమర్స్ చల్లటి వాతవారణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎండ వేడిలో చిక్కుకుని అల్లాడి పోతున్న వాహనదారులు ఆ బ్యాంకు వద్దకు చేరుకోగానే రిప్రెష్ అవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక శీతల ప్రాంతాలకు వెల్లి సేద తీరుతున్నంత ఆనందాన్ని పొందుతున్నామని అంటున్నారు. తీవ్ర రూపం దాల్చిన ఎండల వల్ల ఇంటికి ఎప్పుడు చేరుతామా అన్న ఆందోళనతో ఉంటున్న కరీంనగర్ వాసులు తమ పని తొందరగా కంప్లీట్ అయితే బావుంటుందని అనుకుంటున్నారు. అలాంటి వారంతా కూడా ఈ బ్యాంకు ప్రాంతంలోకి చేరుకుని స్పింక్లర్ల స్ప్రెతో చిరుజల్లులు కురుస్తుండడంతో రిలాక్స్ అయిపోతోంది. గంటకు ఒక ట్యాంకు చొప్పున నీరు వినియోగించాల్సి వస్తోంది.

సేఫ్టీ మేజర్స్ కూడా…

మండుతున్న ఎండల వల్ల వాహనాల్లో మంటలు చెలరేగిపోతున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే సమ్మర్ ఎఫెక్ట్ కూడా ఇందుకు కారణమని చెప్పక తప్పదు. మంటలు చెలరేగిన తరువాత ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టడం కంటే అలాంటి వాతావరణానికే అస్కారం లేకుండా ఉంటే బావుంటుందని పెట్రోల్ బంక్ నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో మిట్ట మద్యాహ్నం నుండి సాయంత్రం వరకు పెట్రోల్ బంక్ లో వాటర్ స్ప్రీ చేయించడం వల్ల చల్లటి వాతావరణం ఏర్పడుతోంది. దీనితో ఫైర్ యాక్సిడెంట్స్ కు కూడా ఈ బంకులో తావు ఉండదు. వేసవి తీవ్రతను తగ్గించేందుకు చాలామంది పౌట్రీ ఫారంలలో స్పింకర్లను ఏర్పాటు చేసి అక్కడ పెరుగుతున్న కోళ్లను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇదే ట్రిక్ ను పెట్రోల్ బంకులోనూ ప్లే చేసిన ఈ బ్యాంక్ యజమాని తీరును చూసి చర్చించుకుంటున్నారు. మంచి ఐడియాతో కస్టమర్స్, పెట్రోల్ బంక్ సేఫ్టీ మేజర్స్ తీసుకున్న తీరు అభినందనీయమని అంటున్నారు వాహనదారులు.

You cannot copy content of this page