దిశ దశ, వరంగల్:
రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. వరంగల్, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో పరిస్థితి మరీ దారుణంగా ఉ:దని, అక్కడి ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామన్నారు. వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి వాసులందరినీ కూడా సేఫ్ చేశామని, సుమారు 70 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడగలిగామని వివరించారు. కాటారం మండలంలో నలుగురు నీటిలో చిక్కుకుని ఉన్నారని వారి కోసం ప్రత్యేకంగా బోట్లు పంపించామని డీజీ నాగిరెడ్డి తెలిపారు.