మెయిల్ చేసినా ట్రాప్ చేస్తాం… ఏసీబీ కేసులో బిగ్ ట్విస్ట్…

దిశ దశ, జగిత్యాల:

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఫిర్యాదు చేసినా లంచం తీసుకునే వారిని పట్టుకుని తీరుతామంటున్నారు. అసలైన బాధితులు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది… వాస్తవాలను ఆరా తీసి పట్టుకోవడం మావంతు అంటున్నారు ఏసీబీ అధికారులు. ఇందుకు తగ్గట్టుగానే తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ ను పట్టుకున్నారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణ మూర్తి ట్రాప్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని బీర్పూర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మనోహర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన ఓ నిందితున్ని కాపాడేందుకు లంచం అడిగాడు. దీంతో దుబాయ్ లో ఉన్న తిరుపతి ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. బీర్పూర్ మండలం పెర్కపల్లికి చెందిన నిందితుడు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిరుపతి బంధువు గంగాధర్ ద్వారా రూ. 5 వేలు తీసుకుంటుండగా కరీంనగర్ ఎసీబీ డీఎస్పీ రమణ మూర్తి నేతృత్వంలో ఏసీబీ ప్రత్యేక బృందం పట్టుకున్నారు.

You cannot copy content of this page