ఎంతో మందికి ఉచిత విద్య అందించా...
దిశ దశ, హుజురాబాద్:
పట్టభద్రుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని, నిరుద్యోగులకు బాసటగా ఉంటానని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వాకర్స్ ను కలిసిన ఆయన మాట్లాడుతూ… పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు తనవంతు బాధ్యత తీసుకున్నానన్నారు. చాలా మందికి ఫీజుల్లో రాయితీలు కల్పించడంతో పాటు ఉచిత విద్య అందిచానని నరేందర్ రెడ్డి వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించిన ఆయన కొంతమంది తనపై చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా రాజకీయంగా ఎదుర్కొలేకనని, వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నయన్నారు. విద్యా, ఉద్యో్గ అవకాశాలు కల్పించడంతో పాటు నవ సమాజ నిర్మాణంలో భాగస్వాుములు కావాలన్న ఉద్దేశ్యంతో తాను శాసనమండలికి నోటీ చేస్తున్నానన్నారు. తనను గెలిపిస్తే విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి యువతకు మరిన్ని ఉపాధి మార్గాలు చూపిస్తానని ప్రకటించారు. విలువలతో కూడిన విద్యను అందించాలన్న తపనతోనే తాను మండలి ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయించుకున్నానన్నారు. స్వయం ఉపాధి మార్గాలు కల్పించడంతో పాటు వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశ పెట్టే దిశగా ముందుకు సాగుతానని వి నరేందర్ రెడ్డి ప్రకటించారు.