పుత్రుని కోసం వికారాబాద్ జిల్లా వాసి కష్టాలు…
దిశ దశ, వికారాబాద్:
కుటుంబాన్ని పోషించేందుకు ముంబాయికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే పరిచయం అయిన మహిళను పెళ్లాడాడు. ఆ దంపతులు పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కొంతకాలానికి మొఖం చాటేసిన ఆ మహిళ పెడుతున్న బాధలు తట్టుకోలేకపోతున్నాడు. తన కొడుకును తనకు అప్పగించాలని వేడుకుంటుంటే… డబ్బులు కావాలని డిమాండ్ చేస్తోందా తల్లి… తనకు న్యాయం చేసి తన బిడ్డను తనకు అప్పిగించాలని అభ్యర్థిస్తున్నాడా బాధితుడు…
అసలేం జరిగిందంటే..?
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగన్నపల్లికి చెందిన తిరుపతయ్య అనే వ్యక్తి 2015లో ముంబాయికి వెళ్లాడు. అక్కడ మేస్త్రీగా పనిచేస్తూ ఉపాధి పొందేందుకు వెల్లిన తిరుపతికి తనతో పాటు పరిచయం అయిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2017లో వీరు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా ఏడాదిన్నర పాటు వైవాహిక జీవితం అలాగే కొనసాగింది. ఎనిమిది నెలల పాటు ఓ ఫాం హౌజ్ లో ఇద్దరు పనికి కుదిరారు. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె భారతీయురాలు కాదని, బంగ్లాదేశ్ కు చెందినదని తెలిసిందని తిరుపతి వివరించారు. అయితే రైతు బంధు చెక్కుల కోసం స్వగ్రామానికి వచ్చిన తాను 20 రోజుల పాటు ఇంటి వద్ద ఉండగా తన ఆమె తనకు కాల్ చేసి తాను తన దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పిన ఆమె కొద్దిరోజులకు బిడ్డను తీసుకుని వెళ్లాలని, అతను బాబును చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని చెప్పిందన్నారు. దీంతో ముంబాయికి వెళ్లి బాబును తీసుకవచ్చి గ్రామంలోని పాఠశాలలో చేర్పించి విద్యాబుద్దులు నేర్పిస్తున్నాని చెప్పాడు. తిరిగి 2022లో ఆమె కాల్ చేసి తాను బంగ్లాదేశ్ వెల్తున్నాని బాబును తీసుకొచ్చి చూపించిన తరువాత వెల్తానని చెప్పడంతో తాను బాబుతో సహా బొంబాయికి వెళ్లాను. అయితే అప్పటికే బంగ్లాదేశీయురాలు, ఆమె చెల్లె, వారి భర్తలు తన వద్ద ఉన్న బాబును లాక్కుని కొట్టి వెల్లగొట్టారని తిరుపతి వివరించారు. స్వగ్రామానికి వచ్చిన తాను అన్నను తీసుకుని ముంబాయికి వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు నివాసం ఉంటున్న ప్రాంతం చూపించడంతో అక్కడ నివాసం ఉంటున్న బంగ్లాదేశీయురాలి చెల్లెలను పట్టుకవచ్చి వదిలేశారన్నారు. సాయంత్రం వారు ఉంటున్న ఇంటికి వెళ్లగా ఈ గది ఖాలీ చేసి వెళ్లిపోయారన్నారు.
వేధింపులు షురూ…
బాబును తీసుకుని వెళ్లి బంగ్లాదేశ్ కు వెల్లిపోయిన మహిళా ఆమె మూడో భర్త కోసం ఆరా తీస్తున్నా లాభం లేకుండా పోయిందని తిరుపతి వివరించారు. అయితే ఒక రోజు తనకు ఓ వ్యక్తి కాల్ చేసి తనకు రూ. 3 లక్షలు అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాలని… కొడుకును అప్పగిస్తామని చెప్పడంతో తాను అతని అకౌంట్ కు రూ. 15 వేలు వేసిన తరువాత ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ఛాప్ అయిందన్నారు. ఓ సారి బంగ్లాదేశ బార్డర్ వరకు వచ్చి రూ. లక్ష ఇవ్వాలని చెప్తే కోల్ కత్తా వరకు డబ్బు తీసుకుని వెళ్లినా వారు మాత్రం కాంటాక్ట్ కాలేదన్నారు. క్యూఆర్ కోడ్ పంపించి డబ్బులు పంపించమని చెప్తే కూడా పంపించానని కనీసం తన బిడ్డను చూపించాలని కోరుతున్నా కూడా వారు మోసం చేస్తున్నారని అన్నారు. తరుచూ తనకు వీడియో కాల్ చేసి బాబుకు ఆరోగ్యం బాగో లేదని, ఇబ్బందులు పెడుతున్నారంటూ వారు తనకు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని తిరుపతి తెలిపారు. దీంతో అతని మోసం చేశాడని భావించి దేశంలోని ప్రముఖులతో పాటు బంగ్లాదేశ్ ప్రధానికి కూడా లేఖ రాశానన్నారు. తాను స్పందన రాకపోవడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి తన బాబును తనకు అప్పగించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. కొడుకు కోసం తాను తల్లడిల్లిపోతున్నానని తన అభ్యర్థనను పరిశీలించాలని కోరుతున్నారు.