రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించాం… డీసీఓ నాగేశ్వర్ రావు

దిశ దశ, మంచిర్యాల:

మంచిర్యాల జిల్లాలో రాఖీ పండుగ నిర్వహణకు అనుమతి లేకపోవడంతో అక్కలచే తమ్ముడు కిటికీ నుండి రక్షలు కట్టించుకున్న వీడియో వైరల్ అయిన ఘటనపై జిల్లా కో ఆర్డినేటింగ్ అధికారి కె నాగేశ్వర్ రావు విచారణ జరిపి నిజానిజాలపై నివేదిక ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కు పంపిన ఈ నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… అందులోని సారాంశం ప్రకారం… తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల విభాగం ద్వారా రామకృష్ణాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో భద్రత చర్యలు తీసుకుంటోంది. రాఖీ పండగ వేడుకలను సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్వహించాలని ముందుగానే పేరెంట్స్ కు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా గురుకుల పాఠశాల ఆవరణలోకి అనుమతించామని, ఆనవాయితీ ప్రకారం వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. వేడుకలు అడ్డుకున్నట్టుగా పేరెంట్స్ ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని, గురుకుల పాఠశాలను అబాసుపాలు చేయాలన్న ఉద్దేశ్యంతో తల్లిదండ్రుల్లోని ఓ దుర్మార్గుడు వైరల్ చేశారని వివరించారు. వాస్తవంగా గురుకుల పాఠశాల ఆవరణలో సుహృద్భావ వాతావరణానికి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వేడకులకు సంబంధించిన ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.

You cannot copy content of this page