పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

దిశ దశ, అంతర్జాతీయం: 

రల్ట్ ఎకనామిక్ ఫోరంలో తొలి రోజు సఫలీకృతంగా సాగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. మొదటి రోజున పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయన్నారు. రాష్ట్రానికి అతి ఎక్కువగా పెట్టుబడులు తీసుకరావడమే లక్ష్యంగా పెట్టుకుని కొనసాగిస్తున్న దావోస్ టూర్ లో ఫస్ట్ డే సానుకూలంగా సాగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం సామాజిక, సమ్మిళత తెలంగాణ సాధించే లక్ష్యానికి అనుగుణంగా కృషి చేస్తోందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రపంచలోనే దిగ్గజ కంపెనీల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకరావడంతో పాటు ఉపాధి కల్పన, రాష్ట్ర అభివృద్ది సాధించాలన్న యోచనతో తమ ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి తెలిపారు. 
https://twitter.com/OffDSB/status/1747542876521992643?t=_GpQg6NVrLiu8wLWWapuQA&s=19

You cannot copy content of this page