కూలిన ‘‘సాగర్’’ రిటైనింగ్ వాల్..?

దిశ దశ, హైదరాబాద్:

సుంకిశాల వద్ద రిటైనింగ్ వాల్ కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున సాగర్ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన నేపథ్యంలో ఇక్కడి నుండి హైదరబాద్ కు తాగునీటిని అందించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా టన్నెల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సొరంగంలోకి సాగర్ నుండి నీరు రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఇటీవల నాగార్జున సాగర్ లోకి వరద నీరు పోటెత్తడండంతో అధికారులు గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో రిటైనింగ్ వాల్ కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. ఆగస్టు 1న జరిగినట్టుగా ప్రచారం జరుగుతున్న ఈ ఘటన సమయంలో ఆ సమయంలో పనులు చేస్తున్న కూలీల షిఫ్టు మారుతున్నారని సమాచారం. దీంతో వాల్ కూలిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం వాటిల్ల లేదని సమాచారం.

అంచనాలో విఫలమా..?

సుంకిశాల పంప్ హౌజ్ పంప్ హౌజ్ లో జరిగిన ఈ ఘటనలో ఇంటెక్ వెల్ టన్నెల్ రిటైంనిగ్ వాల్ కూలడానికి కారణాలు ఏంటన్నదే ప్రశ్నార్థకంగా మారింది. వరద ఉధృతి కారణంగానే ఈ వాల్ కూలిపోయిందని ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారోనన్న ప్రశ్న తలెత్తుతోంది. సాగర్ కు వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి అంతకు అదనంగా నీరు వచ్చి చేరినా గోడ తట్టకునేంత పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుందన్నది వాస్తవం. కాంక్రీట్ తో పాటు స్టీల్ తదితర ముడిసరకులు సామర్థ్యాన్ని పెంచి ఎంతటి వరద వచ్చినా ఆ వాల్ కొట్టుకపోకుండా ఉండే విధంగా నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా లేదా అన్న విషయంపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఓ వైపున గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న క్రమంలోనే ఈ పరిస్థితి ఎదురైందంటే బ్యాక్ వాటర్ నిలువ ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్ కూలిపోతే బ్యాక్ వాటర్ ఉధృతి మరింత తీవ్రంగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు ఈ వాల్ నిర్మాణం కోసం ఎలాంటి అంచనాలు తయారు చేశారు, కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ తీసుకున్న చర్యలు ఏంటీ అన్న వివారలపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఒక వేళ కూలీలు అక్కడ పని చేస్తున్న సమయంలో గోడ కుప్పకూలిపోయినట్టయితే ప్రాణ నష్టం ఎంతమేర జరిగేదో అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page